Advertisement

రేవంత్‌ని పవన్ కళ్యాణ్ ఏం కోరారంటే?


తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైన వారి త్యాగాలకు గౌరవాన్ని, సార్థకతను కల్పించి.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం.. అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తెలుపుతూ.. తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డికి, ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన మంత్రివర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ.. జనసేన తరపున ఓ లేఖను ఆయన విడుదల చేశారు. అందులో.. 

Advertisement

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డిగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన మంత్రివర్గ సహచరులకు శుభాభినందనలు. రేవంత్‌ రెడ్డిగారితో నాకు వ్యక్తిగతంగా స్నేహం ఉంది. తెలంగాణలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని తమ పార్టీ అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించారు. వాగ్ధాటి, ప్రజాకర్షణ కలిగిన ఆయన రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. 

తెలంగాణలో జరిగిన ఉద్యమాలు, వాటి నేపథ్యాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డిగారు. నీళ్లు, నిధులు, నియామకాలు.. ప్రధాన అంశాలుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత.. ఏ ఆశయాల కోసం ఆత్మ బలిదానాలు చేసిందో వాటిని సంపూర్ణంగా నెరవేర్చి ఆ త్యాగాలకు గౌరవాన్ని, సార్థకతను కల్పించాలి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం.. అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

Pawan Kalyan Suggestions to Revanth Reddy:

Pawan Kalyan Greets Revanth Reddy After Becoming CM
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement