Advertisement
Google Ads BL

సినిమా ఇండస్ట్రీ నుండి చిరునే ఫస్ట్


హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ రాష్ట్ర నూతన సీఎంగా ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఆయన కేబినెట్‌కు సంబంధించి మరో 11 మంది మంత్రులు కూడా ప్రమాణం స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి నూతన సీఎంగా, యంగ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీ నుండి మాత్రం మెగాస్టార్ చిరంజీవి మొట్టమొదటిగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement
CJ Advs

ఎన్నికల అనంతరం వెలువడిన రిజల్ట్ తర్వాత సినిమా ఇండస్ట్రీ నుండి పలువురు సెలబ్రిటీలు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కానీ రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే శుభాకాంక్షలు తెలిపింది మాత్రం మెగాస్టారే. అందుకే సోషల్ మీడియా వేదికగా చిరంజీవి పేరు మారుమోగుతోంది. మెగాస్టారే ఫస్ట్ అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ మొదలెట్టారు. 

ఇక చిరు తన ట్వీట్‌లో.. తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన రేవంతరెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన భట్టి విక్రమార్కగారికి, కొత్తగా కేబినెట్‌లో చోటు దక్కించుకున్న, ఎన్నికైన సీఎల్పీ నేతలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

Chiranjeevi Greets Revanth Reddy After Becoming CM:

Mega Star Greets Revanth Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs