Advertisement
Google Ads BL

దగ్గుబాటి అభిరామ్ పెళ్లి ఫొటో వైరల్..


టాలీవుడ్ అగ్ర నిర్మాతలలో ఒకరైన దగ్గుబాటి సురేశ్ బాబు రెండో తనయుడు దగ్గుబాటి అభిరామ్ వివాహం శ్రీలంకలో అంగరంగ వైభవంగా జరిగింది. తాజాగా ఈ పెళ్లికి సంబంధించి ఓ పిక్ సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఈ పిక్‌లో నూతన దంపతులిద్దరిని.. సురేష్ బాబు దంపతులు ఆశీర్వదిస్తున్నారు. ఈ పిక్ కలర్ ఫుల్‌గా ఉండటమే కాకుండా.. పెళ్లి ఎంత గ్రాండ్‌గా జరిగిందనే విషయాన్ని తెలియజేస్తుంది.

Advertisement
CJ Advs

దగ్గుబాటి అభిరామ్ తమ కుటుంబానికి ఎంతో దగ్గరైన ప్రత్యూష చాపరాలను వివాహం చేసుకున్నారు. అభిరామ్, ప్రత్యూషల పెళ్లి శ్రీలంకలోని ఓ రిసార్ట్‌లో.. కేవలం కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువుల సమక్షంలో జరిగింది. ఇరు ఫ్యామిలీలు ఈ పెళ్లిని మూడు రోజుల పాటు శ్రీలంకలో జరిపించాలని ముందే నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అంతా ముందుగానే శ్రీలంకకు పయనమయ్యారు.

అయితే ఈ పెళ్లికి టాలీవుడ్ నుండి సెలబ్రిటీలెవరూ హాజరు కాలేదని తెలుస్తోంది. శ్రీలంకలో మూడు రోజుల వివాహం ముగిసిన అనంతరం.. అందరూ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత దగ్గుబాటి ఫ్యామిలీ గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఈ రిసెప్షన్‌కు మాత్రం అందరినీ ఆహ్వానించనున్నారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో చూసిన వారంతా.. దగ్గుబాటి అభిరామ్ ఓ ఇంటివాడయ్యాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Daggubati Abhiram Wedding Photo Goes Viral:

Daggubati Abhiram and Pratyusha Wedding Pic  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs