Advertisement
Google Ads BL

బాలేదంటే.. యానిమల్‌పై హరీష్ శంకర్


యానిమల్ సినిమా చూసిన చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఎలా సినిమా తీశావంటూ దర్శకుడు సందీప్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ కూడా సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తూ.. సినిమాకు సంబంధించి ఒక్కొక్కరిని ప్రత్యేకంగా పొగుడుతూ ట్వీట్స్ చేస్తున్నారు. దర్శకుడు సందీప్ వంగా గ్రేట్‌నెస్ గురించి తెలుపుతూ.. ట్విట్టర్ వేదికగా ఓ లేఖను విడుదల చేశారు. ఇందులో..

Advertisement
CJ Advs

బావుందంటే.. బాగోదేమో.. 

యానిమల్ చూసిన కొంతమంది అనుకుంటున్న మాటలివి. నచ్చిన వాళ్ళు మాత్రం బావుంది అని అనడం లేదు.. బద్దలైపోయింది అంటున్నారు. సినిమాకు రూల్స్ ఏం లేవండి.. అని అందరూ అంటుంటారు. అతను మాత్రం అనకుండా బ్రేక్ చేసి చూపించాడు. Even though I have concerns about second Half, I don’t think it would matter now. అసలు ఈ వాక్యం రాస్తున్నప్పుడే నేనెంత naive అనే feeling వస్తుంది. Because you can argue with content, but not with success. 

సినిమా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు అనే కంటే సినిమా గురించి చెప్పడానికి ఎవరూ లేరు. ఎందుకంటే దాదాపుగా నాకు తెలిసిన వాళ్ళందరూ ఒకటికి రెండుసార్లు చూశారు. అతని పేరులోనే వంగా అని ఉన్నప్పుడు విమర్శలకూ, విశ్లేషణలకు అతను వంగుతాడనుకోవడం అమాయకత్వం. ఎవరి విషయం ఎలా ఉన్నా.. ఎక్కువ length ఉంటే repeat audience రారేమో అన్న నా myth ని సందీప్ తన Interval లో వాడిన gun తో పేల్చేసినందుకు తనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ... ఇంతరాశాక నేను సినిమా... 

బాలేదంటే.. బాగోదేమో... అని హరీష్ విడుదల చేసిన లేఖలో పేర్కొన్నాడు.

Harish Shankar Praises on Director Sandeep Vanga :

Harish Shankar Letter on Animal Director    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs