Advertisement
Google Ads BL

రిమాండ్‌కి పుష్ప కేశవ


అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమాలో కేశవ పాత్రలో నటించిన జగదీశ్.. ఆ తర్వాత మంచి పాపులర్ నటుడిగా పేరుపొందిన విషయం తెలిసిందే. అయితే.. ఓ మహిళను వేధించిన కేసులో ఇప్పుడీ నటుడిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమై.. పరారీలో ఉన్న జగదీశ్‌ని పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి వెంటనే కోర్టులో హాజరు పరిచారు.

Advertisement
CJ Advs

అసలు విషయం ఏమిటంటే.. జగదీశ్‌కు ఓ మహిళా జూనియర్ ఆర్టిస్ట్‌తో ఎప్పటి నుండో పరిచయం ఉంది. అయితే ఆ మహిళ వేరే వ్యక్తితో ఉండటం గమనించిన జగదీశ్.. ఆ ఫొటోలను తీసి.. ఆమెను బెదిరించడం మొదలెట్టారు. ఈ విషయంలో జగదీశ్‌పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే జగదీశ్ ఫొటోలు తీసి బెదిరించడం స్టార్ట్ చేసిన రెండు రోజులకే.. సదరు జూనియర్ ఆర్టిస్ట్ ఆత్మహత్య చేసుకుంది.

ఆమె ఆత్మహత్య అనంతరం దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు కారణం జగదీశ్ అని తెలియడంతో.. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ విషయం తెలుసుకున్న జగదీశ్ పరారయ్యాడు. ఎట్టకేలకు పోలీసులు అతడిని పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Case Registered on Pushpa Actor Jagadeesh:

Pushpa Actor Keshava Arrested  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs