Advertisement
Google Ads BL

దారుణం.. డీప్‌ ఫేక్‌ బారిన మరో నటి


డీప్ ఫేక్.. సెలబ్రిటీల గుండెల్లో బాంబులు పేల్చుతోంది. ఎవరు, ఏ రోజు ఈ డీప్‌ ఫేక్‌కు బలవుతారో అర్థం కానంతగా.. సెలబ్రిటీలను భయాందోళనకు గురి చేస్తుంది. రీసెంట్‌గా రష్మిక మందన్నా ఈ డీప్ ఫేక్‌కు ఎలా బలైందో తెలిసిందే. ఆ డీప్ ఫేక్ వీడియో తర్వాత ఆమెకు అన్ని వర్గాల నుండి సపోర్ట్ లభించింది. అసలు విషయం ఏమిటనేది జనాలకు కూడా అర్థమైంది. రష్మిక తర్వాత కాజోల్, కత్రినా, అలియా వంటి వారు కూడా ఈ డీప్ ‌ఫేక్‌కు బలయ్యారు. ఇప్పుడు మరో హీరోయిన్‌పై డీప్ ఫేక్ రాయళ్లు అటాక్ చేశారు. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా.

Advertisement
CJ Advs

దారుణం ఏమిటంటే.. గతంలో ప్రియాంక మాట్లాడిన ఓ వీడియోని తీసుకున్న డీప్ ఫేక్ ఆకతాయిలు.. ఆమె ముఖం మార్చకుండా అందులోని వాయిస్‌ను మార్చి.. లిప్ సింక్ అయ్యేలా ఓ నకిలీ బ్రాండ్‌ని ప్రమోట్ చేయించారు. ఆమె తన వార్షిక ఆదాయాన్ని చెబుతున్నట్లుగా ఈ వీడియోలో సృష్టించారు. ఒక బ్రాండ్‌ కారణంగా 2023లో తన వార్షిక ఆదాయం భారీగా పెరిగిందని.. అందరూ దాన్నే ఉపయోగించాలని ప్రియాంకా చోప్రా చెప్పినట్లుగా రెడీ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇప్పుడీ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.  

ఈ వీడియోపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. మరీ ఇంత దారుణమా.. టెక్నాలజీని ఇంత మిస్ యూజ్ చేస్తున్నా.. అధికారులు పట్టించుకోరా? అంటూ ప్రభుత్వాలపై మండిపడుతున్నారు. కొందరేమో.. ఇది ముంబై‌లోనే జరుగుతుంది.. అక్కడి ఆకతాయిలే ఇలా చేస్తున్నారు. కేవలం బాలీవుడ్ హీరోయిన్లనే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని, ఈ విధానాన్ని వెంటనే స్టాప్ చేయాలంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.

Deepfake Attack on One More Bollywood Heroine :

Priyanka Chopra DeepFake Video Goes Viral <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs