బాలీవుడ్ యాక్టర్ సన్నీడియోల్‌పై ఒక్కసారిగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఓ వీడియోనే. సోషల్ మీడియాలో సన్నీడియోల్‌కి సంబంధించి ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సన్నీడియోల్ తాగి నడి రోడ్డుపై ఒంటరిగా ఊగుతూ నడుస్తున్నారు. అంతే ఒక్కసారిగా ఆయనపై నెగిటివ్ టాక్ మొదలైంది. వాస్తవానికి సన్నీడియోల్ చాలా సందర్భాల్లో ఆల్కహాల్ తీసుకోనని చెప్పి ఉన్నారు. అయినా కూడా ఆ వీడియో వాస్తవమో కాదో తెలుసుకోకుండా.. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు కామెంట్స్ చేస్తున్నారు.
కట్ చేస్తే.. నిజంగానే ఆ వీడియో నిజమైనది కాదని స్వయంగా సన్నీడియోలే చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. తను ట్రోల్ కావడానికి కారణమైన వీడియో నిజమైనది కాదని, అదొక సినిమా షూటింగ్ అని వివరణ ఇస్తూ.. షూటింగ్‌కి సంబంధించిన వీడియోని ఆయన పోస్ట్ చేశారు. దీంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. అనవసరంగా నోరు పారేసుకున్నామనేలా సారీ చెబుతున్నారు.
సన్నీడియోల్ ప్రస్తుతం సఫారీ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌లోని ఓ సన్నివేశాన్ని ముంబైలోని జుహు ఏరియాలో అర్థరాత్రి చిత్రీకరించారు. తాగి నడిరోడ్డుపై తూగుతూ వెళుతున్న సన్నీడియోల్‌ని ఓ ఆటోవాలా ఎక్కించుకుని వెళ్లే సీన్ అది. ఈ సీన్‌లో వీడియోని ఎవరో లీక్ చేశారు. అది షూటింగ్ అని తెలియక నెటిజన్లు నోరుపారేసుకున్నారు.