మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ ఎన్నికలు మొదలైనప్పటి నుంచి, ఫలితాలు వెల్లడై.. ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు వచ్చినా.. ఇండస్ట్రీలో పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా ఉన్న ఓ వెబ్ సైట్ మాత్రం.. ఇంకా జనసేనపై పడే ఏడుస్తోంది. తెలంగాణలో రెండు సార్లు విజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ ఓడిపోతున్నా.. అది వదిలేసి జనసేనకు డిపాజిట్లు కూడా రాలేదంటూ వార్తలు వడ్డించారు.
అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ విక్టరీ అని తెలుగు మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు ఫోకస్ పెడితే.. ఆ వెబ్‌సైట్‌కి మాత్రం అదేం పట్టలేదు. జనసేనకు డిపాజిట్ కరువు.. ఇది జనసేన పరిస్థితి అంటూ ప్రచారం మొదలెట్టింది. ఇదంతా ఎందుకూ అంటే.. భయం. పవన్ కళ్యాణ్ పేరు, జనసేన పార్టీని తలుచుకోకుండా వెబ్‌సైట్ రన్ చేయడం వాళ్ల వల్ల కాదు. ప్రపంచం మునిగిపోతున్నా కూడా వారికి జనసేన, పవన్ ఏం చేస్తున్నారో.. అని ఫోకస్ పెడుతుంటారు.
వాళ్లు అభిమానించే వీర విధేయులు అసలు పోటీ చేయకుండానే ఓటమిని అంగీకరిస్తే.. బిజెపితో ఉన్న పొత్తు కారణంగానూ, జనసైనికులు కోరిక మేరకు ఈ తెలంగాణ ఎన్నికల్లో 8 చోట్ల జనసేన పోటీ చేసి.. ముందు ముందు ఇక్కడి ప్రజలకు ధైర్యంగా నిలబడతామనే హామిని ఇచ్చింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ అన్నట్లుగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. పవన్ సపోర్ట్ చేసిన బిజెపీ చాలా చోట్ల టఫ్ ఫైట్ ఇచ్చింది. ఓటింగ్ శాతం కూడా వారికి బాగా పెరిగింది.
ఇక జనసేన విషయానికి వస్తే.. 2014లో కూకట్‌పల్లి నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థికి 21,887 ఓట్లు వస్తే, ఇప్పుడు జనసేన తరపున ఇదే నియోజక వర్గంలో పోటీ చేసిన అభ్యర్థికి 39,830 ఓట్లు వచ్చాయి. ఇది చాలదా తేడా చెప్పడానికి. గెలుపోటములనేవి సహజం. అసలు పోటీయే చేయని పార్టీని పక్కన పెట్టి.. కేవలం 8 స్థానాల్లో, అదీ కూడా భారీ కాంపిటేషన్ మధ్య పోటీ చేసిన పార్టీ గురించే వార్తలు రాస్తూ, జపం చేస్తున్నారంటే.. గట్టిగానే భయం పట్టుకుంది. ఆ భయమేంటో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదుగా..