Advertisement
Google Ads BL

BB7: అమర్ తో గొడవపడ్డ శోభా, ప్రియాంక


బిగ్ బాస్ సీజన్ 7 లో సీరియల్ బ్యాచ్ గా పేరు తెచ్చుకున్న అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టిలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బడ్డీలుగా స్టార్ మా కి దత్త పుత్రుల్లా మారిపోయారు అంటూ సోషల్ మీడియాలో శివాజీ, పల్లవి ప్రశాంత్ అభిమానులు మాట్లాడుతున్నారు. శోభా శేట్టిని, అమర్ ని ఎలిమినేట్ కాకుండా స్టార్ మా కాపాడుతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే మొదటినుంచి స్నేహతులుగా సహాయసహకారాలనందించుకుని.. అమర్ ని కాపాడిన ప్రియాంక చివరి నామినేషన్ లో అమర్ దీప్ ఫౌల్ గేమ్ ఆడడంటూ నామినేట్ చేసింది. 

Advertisement
CJ Advs

అంతేకాకుండా టికెట్ టు ఫినాలే టాస్క్ లో అమర్ దీప్ ప్రియాంకని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసాడు. ఆ స్ట్రెస్ లో పియంక అమర్ ని నామినేట్ చేసింది. ఇక ఈ నామినేషన్స్ లో రైతు బిడ్డ అమర్ చాలా గొడవ పెట్టుకున్నాడు, వారికి నామినేషన్స్ లో కాదు ఆ తర్వాత కూడా చాలా పెద్ద గొడవ జరిగిన ప్రోమో ఈరోజు వదిలారు. మరోపక్క బడ్డీస్ ప్రియాంక కి అమర్ కి తీవ్ర స్థాయిలో గొడవైంది. అమర్ దీప్ ప్రియాంక బొమ్మని కాలితో తన్నాడు. ప్రియాంక సరదాగా తన బొమ్మతో అమర్ ముక్కుపై కొట్టింది. దానితో కోపమొచ్చిన అమర్ ప్రియాంక బొమ్మని విసిరికొట్టాడు.

అప్పుడు ప్రియాంక అమర్ తో గొడవపడింది. అమర్ దీప్ కూడా బొమ్మ గురించి నాతో గొడవ పెట్టుకుంటున్నావ్ అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. తరువాత ఈ బొమ్మ గురించే కదా గొడవ అని శోభ శెట్టి దానిని స్టోర్ రూమ్ లో పెట్టేస్తాను అంటూ వెళ్లబోతుండగా ప్రియాంక ఆపింది. మరి ఎంతోమంచి ఫ్రెండ్స్ గా ఉన్న అమర్-ప్రియాంక, శోభలు చివరి వారంలో పడిన గొడవ ప్రోమో వైరల్ అయ్యింది. 

BB7: Shobha and Priyanka quarreled with Amardeep:

Bigg Boss 7: Amardeep vs Priyanka, Sobha Shetty
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs