గత రెండు రోజులుగా తెలంగాణ సీఎం విషయంలో నడుస్తున్న హై డ్రామాకి ఫైనల్ గా తెర పడింది. కాంగ్రెస్ నేతలు ఏకగ్రీవంగా సీఎల్పీ నాయకుడిగా, తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నట్టుగా కేసి వేణుగోపాల్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన రేవంత్ కె అధిష్టానం పట్టం కట్టింది. ప్రజల మనోభావాలకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని తెలంగాణాలో కాంగ్రస్ ని గెలిపించిన ప్రజల మనసులని గెలుచుకుంది.
కేసి వేణుగోపాల్ ప్రెస్ మీట్ హైలైట్స్
రేవంత్ రెడ్డి ను కాంగ్రెస్ అగ్రనాయకత్వం సీఎం గా ప్రకటించింది...
పార్టీ ప్రసిడెంట్ నిర్ణయాన్ని మీడియా వేదికగా ప్రకటించిన కేసీ వేణుగోపాల్...
ఢిల్లీ లాబియింగ్ కు కాలం చెల్లింది కేవలం తెలంగాణ ప్రజల అభిమతాన్ని మాత్రమే పరిగణలోనికి తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం...
ఫలితాలు వెలువడ్డ 48 గంటల్లో కాంగ్రెస్ పార్టీ CLP నాయకుణ్ణి ప్రకటించడం విశేషం.
అత్యంత స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ కాంగ్రెస్...
మిగిలిన ఏ ఒక్క పార్టీలో వ్యక్తి చెప్పిందే వేదం కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సైనికులు చెప్పిందే వేదం...
ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నిర్ణయం... కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోగతం
ఇక రేవంత్ రెడ్డి తెలంగాణ కొత్త సీఎం గా ఈనెల 7 అంటే గురువారం ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నట్టుగా కేసి వేణు గోపాల్ మీడియా మీట్ లో వివరించారు. ఈ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ, సోనియా, ప్రియనా గాంధీ లతో పాటుగా ఖర్గే, థాక్రే, వేణుగోపాల్ లు హాజరవుతారని తెలుస్తుంది.