Advertisement
Google Ads BL

వీక్ డేస్ లోను యానిమల్ జోరు తగ్గలా..


ఎంత పెద్ద చిత్రమైనా, ఎంత హిట్ చితమైనా వీక్ డేస్ లో వీకైపోవడం, వీక్ డేస్ లో థియేటర్ ఆక్యుపెన్సీ తగ్గిపోవడం చూస్తున్నాము, ఈమధ్యన ఓటిటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాక అది మరీ ఎక్కువైంది. అయితే ఇప్పుడు యానిమల్ ఆ సెంటిమెంట్ ని అధిగమించింది. వీకెండ్ లోనే కాదు వీక్ డేస్ లోను అద్భుతమయిన కలెక్షన్స్ సాధించి ఔరా అనిపించింది. గత శుక్రవారం డిసెంబర్ 1 న విడుదలైన చిత్రానికి హిందీలో సూపర్ రెస్పాన్స్ రాగా.. మిగతా భాషల్లో హిట్ టాక్ తెచ్చుకుంది.

Advertisement
CJ Advs

యూత్ కి విపరీతంగా నచ్చేసిన ఈ చిత్రం వర్కింగ్ డే సోమవారం కలెక్షన్స్ చితక్కొకట్టేసింది. మొదటి షోకే సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న యానిమల్ చిత్రాన్ని యూత్ టార్గెట్ చేసారు. రణబీర్ కపూర్ యాక్టింగ్, సందీప్ వంగా మేకింగ్ సిటీ, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ బాగా నచ్చడంతో యానిమల్ కి ఓటేశారు. ఇండియాలో ఈ సినిమా నాలుగో రోజు అంటే సోమవారం వసూళ్లు 30 కోట్లు దాటిపోయాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ 50 కోట్లకు పైగానే ఉంది

ఇప్పటికే యానిమల్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబట్టింది. ఎంత మంచి టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ జోరు వీకెండ్ వరకే ఉంటుంది.. కానీ యానిమల్ మాత్రం ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి సోమవారం కూడా దూసుకుపోవడంతో కలెక్షన్స్ పరంగా చాలా తొందరగా కొత్త మార్క్ ని చేరుకుంది. 

Animal Passed Monday Test:

Animal is Unstoppable Crossed 400 Cr
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs