Advertisement

నాని-నితిన్ కి వరుణుడి గండం


డిసెంబర్ మొదటి వారంలో బాక్సాఫీసు దగ్గర ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది. అక్టోబర్ లో భగవంత్ కేసరి తర్వాత వారం వారం చిన్న సినిమాలు, డబ్బింగ్ సినిమాలు తప్ప ఓ మిడియం సినిమాలు విడుదల కాలేదు. కానీ ఈ వారం కుర్ర హీరోలు నువ్వా - నేనా అని పోటీ పడుతున్నారు. అందులో నాని హాయ్ నాన్న తో వచ్చే గురువారం డిసెంబర్ 7 నే రాబోతున్నాడు. అది కూడా ప్యాన్ ఇండియా మూవీగా హాయ్ నాన్నని ప్రమోట్ చేసి విడుదలకు రంగం సిద్ధం చేసాడు. ప్రమోషన్స్ వైజ్ గా సినిమాపై అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసాడు.

Advertisement

ఇక వచ్చే శుక్రవారం డిసెంబర్ 8 న హీరో నితిన్ వక్కంతం వంశితో కలసి ఎక్సట్రార్డినరీ మ్యాన్ గా రాబోతున్నాడు. హీరోయిన్ శ్రీలీల తో నితిన్ రొమాన్స్ చేస్తుండగా.. గత వారం రోజులుగా ఎక్స్ట్రా ప్రమోషన్స్ లో నితిన్ కి ఊపిరి సలపడం లేదు. ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకుల్లో క్రేజ్ కనిపిస్తుండగా.. ఇప్పుడు ఈ ఇద్దరి హీరోలకి వరుణుడు అడ్డం పడుతున్నాడు. ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రతుఫాను మిచౌంగ్ తో ప్రజలు సతమతమవుతున్నారు. 

నెల్లూరుకు 50 కి.మీ, బాపట్లకు 110 కి.మీ, మచిలీపట్నానికి 170కి.మీ. దూరంలో తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. మధ్యాహ్ననంలోపు నెల్లూరు - మచిలీపట్నం మధ్య బాపట్ల దగ్గర తీవ్రతుఫానుగా తీరం దాటనున్న మిచౌంగ్. ఈ తుఫాను ప్రభావంతో కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ తీవ్రభారీ వర్షాలు కురిసే అవకాశం.. ఉంది అంటూ వాతావరణ శాఖ ప్రకటించింది. అటు హాయ్ నాన్న కి తమిళనాట కూడా ఈ తుఫాను పెద్ద ప్రాబ్లమే తెచ్చి పెట్టింది. చెన్నై రైన్స్ తమిళనాడుని అతలాకుతలం చేస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో చూస్తున్నాం. మరి హీరోలిద్దరూ కష్టపడి ప్రేక్షకుల ముందుకు వస్తుంటే ఈ తుఫాను కారణంగా ఆడియన్స్ ఎంతవరకు థియేటర్స్ కి వస్తారో చూడాలి. 

Nithiin, Nani to promote their films:

Nani vs Nithin
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement