Advertisement
Google Ads BL

సీఎం ప్రమాణ స్వీకారానికి ప్లేస్, టైమ్ ఫిక్స్...!


తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వెంటనే అధికార పగ్గాలు చేపట్టేందుకు సమాయత్తమైంది. కూల్‌గా దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఓ వైపు జరిగిపోతున్నాయి. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నేటి సాయంత్రమే ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. దీనికోసం ప్లేస్, టైమ్ కూడా ఫిక్స్ అయ్యింది. ఇవాళ సప్తమి మంచి రోజు కావడంతో ఇవాళే ప్రమాణ స్వీకారానికి అధిష్టానం ముహూర్తం ఖరారు చేసింది. ఈ రోజు రాత్రి 8 గంటల వరకే సప్తమి ఉంది. కాబట్టి సాయంత్రం 6 గంటలకు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసింది.

Advertisement
CJ Advs

సీఎం రేవంత్‌రెడ్డే..!

రాజ్ భవన్‌లోనే సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం జరగనుంది. దీని కోసం టీ కాంగ్రెస్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాజ్‌భవన్‌లో సౌకర్యాల గురించి ఆరా తీసిన కాంగ్రెస్ నాయకత్వం.. 300 మంది వరకూ పాల్గొనేందుకు అవసరమైన సౌకర్యాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే సీఎల్పీ సమావేశం జరుగుతున్న హోటల్ ఎల్లా నుంచి రాజ్‌భవన్‌కు బస్సులను సైతం ఏర్పాటు చేసింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అనే అంతా భావిస్తున్నారు. డిప్యూటీ సీఎం విషయంలో క్లారిటీ అయితే రాలేదు కానీ భట్టి విక్రమార్కను చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

9న భారీ ఎత్తున విజయోత్సవ సభ..

ఇక మరి సీఎం, డిప్యూటీ సీఎంల ప్రమాణ స్వీకారం సింపుల్‌గా నిర్వహించేసి.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున విజయోత్సవ సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆపై అదే రోజున మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గేలతో పాటు పెద్ద సంఖ్యలో ఏఐసీసీ నాయకులను ఆహ్వానించాలని రాష్ట్ర నాయకత్వం యోచిస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అభిమానులు సైతం పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. ఇక సీఎల్పీ నేత ఎంపిక సైతం ఇవాళే కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. ఈ క్రమంలోనే హోటల్ ఎల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమావేశమయ్యారు. . సీఎల్పీ నేత ఎంపిక ప్రక్రియ పూర్తవగానే ఆ నివేదికను ఏఐసీసీ పరిశీలకులు అధిష్టానానికి పంపనుంది. ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే తదుపరి కార్యక్రమం నిర్వహించనున్నారు.

Place And Time Fix for CM Oath Taking :

Revanth Reddy To Take Oath as CM
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs