ప్రభాస్ ఫాన్స్ కి డిసెంబర్ 1 న వదిలిన సలార్ ట్రైలర్ కిక్ ఇచ్చినప్పటికీ సోషల్ మీడియాలో ఆ ట్రైలర్ పై వచ్చిన నెగెటివ్ కామెంట్స్ అభిమానులని బాధపెట్టాయి. ప్రశాంత్ నీల్ ప్రభాస్ ని కూడా KGF హీరోలానే చూపించారు, అక్కడ మథర్ సెంటిమెంట్, ఇక్కడ ఫ్రెండ్ సెంటిమెంట్ అంతే తేడా.. మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటూ సోషల్ మీడియాలో సలార్ ట్రైలర్ పై రకరకాల న్యూస్ లు స్ప్రెడ్ అయ్యాయి. ఇక సలార్ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అయితే క్రియేట్ అయ్యాయని తెలుస్తుంది. అందుకే మేకర్స్ మరో ప్లాన్ సిద్ధం చేశారట.
ప్రభాస్ ఫాన్స్ కి మరో సర్ ప్రైజ్ రెడీ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ వారం చివరిలో అంటే డిసెంబర్ 10 లోపు మరో ట్రైలర్ ని అది కూడా యాక్షన్ ప్యాకెడ్ ట్రైలర్ ని వదలాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. ఈసారి ప్రభాస్ ని ఫాన్స్ కి మెచ్చే లెవల్ లో చూపించాలని, ఈ ట్రైలర్ మొత్తం యాక్షన్ తోనే నింపెయ్యబోతున్నారని తెలుస్తుంది. మొదటి ట్రైలర్ కి మించి ఈ ట్రైలర్ ఉంటుంది.. ఇది ఖచ్చితంగా ఫాన్స్ ని, ప్రేక్షకులని ఇంప్రెస్స్ చేస్తుంది అంటున్నారు. అయితే సలార్ సెకండ్ ట్రైలర్ పై మేకర్స్ అయితే స్పష్టతనివ్వలేదు.
ఇక పృథ్వీ రాజ్ సుకుమారన్ సలార్ విలన్ గా గూస్ బంప్స్ తెప్పిస్తుండగా.. హీరోయిన్ శృతి హాసన్ క్యూట్ గా బ్యూటీ ఫుల్ గా ఉండబోతున్నట్టుగా సలార్ ట్రైలర్ లోనే హింట్ ఇచ్చారు.