Advertisement
Google Ads BL

దగ్గుబాటి అభిరామ్ మూడురోజుల పెళ్లి


దగ్గుబాటి ఇంట్లో పెళ్లి భాజాలు మొదలైపోయాయి. హీరో రానా తమ్ముడు, నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్ పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యాడు. ఈ నెల 7 అంటే ఈ బుధవారమే అభిరామ్ వరసకు మరదలయ్యే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడు.పెద్దలు కుదిర్చిన ప్రత్యూషతో ఏడడుగులు నడవబోతున్నాడు. అభిరామ్ వివాహం హైదరాబాద్ లో జరగడం లేదు. దగ్గుబాటి అభిరామ్ వివాహాన్ని కుటుంబ సభ్యులు శ్రీలంక వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ గా చెయ్యబోతున్నారు.

Advertisement
CJ Advs

ఈరోజు సోమవారం మొదలుకుని మూడు రోజుల పాటు శ్రీలంక వేదికగా అభిరామ్ వివాహాన్ని గ్రాండ్ గా ప్లాన్ చేసింది దగ్గుబాటి కుటుంబం. నేటి రాత్రి డిన్నర్, కాక్ టైల్ పార్టీ తో మొదలయ్యే ఈ పెళ్లి వేడుకలు, రేపు మంగళవారం మెహిందీ, సంగీత్ సెర్మోని వేడుకలతో పాటుగా.. బుధవారం పెళ్లి కొడుకు-పెళ్లి కూతురు ఫంక్షన్, హల్దీ సెర్మోని తో పాటుగా అదే రోజు రాత్రి 8.50 నిమిషాలకి అభిరామ్ ప్రత్యూష మెడలో తాళి కట్టబోతాడని తెలుస్తుంది.

మరి సోమవారం, మంగళవారం, బుధవారం ఇలా మూడురోజుల పాటు జరగబోయే అభిరామ్ పెళ్లి వేడుకల కోసం ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీ, నాగ చైతన్యలు శ్రీలంక పయనమయినట్లుగా తెలుస్తుంది. పెళ్లి తర్వాత సురేష్ బాబు హైదరాబాద్ లో సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం.

Abhiram Daggubati destination wedding on this date:

Abhiram Daggubati Destination Wedding Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs