Advertisement

వామ్మో.. కేసీఆర్ ఇజ్జత్ పాయే..


వామ్మో.. మూడో స్థానానికి పడిపోయిన కేసీఆర్..

Advertisement

తెలంగాణ ఎన్నికల ఫలితాలు చిత్ర విచిత్రంగా మారాయి. ఇక్కడ రౌండ్ రౌండ్‌కీ సీన్ మారిపోతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేసిన విషయం తెలిసిందే. గజ్వేల్, కామారెడ్డిలలో పోటీ చేశారు. ఆయన సొంత నియోజవర్గంలో గజ్వల్‌లో పోటీ చేసి ఉంటే సరిపోయేది కానీ కామారెడ్డిలో పోటీ చేసి చేతులు కాల్చుకున్నారు. ఇక్కడ ఏకంగా కేసీఆర్ మూడో స్థానానికి పడిపోయారు. ఇక్కడ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అగ్రస్థానంలో దూసుకు పోతుండగా.. బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో కొనసాగుతున్నారు. సీఎం కేసీఆర్ మాత్రం మూడో స్థానంలో ఉన్నారు.

బీజేపీ అగ్ర నేతలు సైతం ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఉన్నారు. బీజేపీ కీలక నేత బండి సంజయ్ ఎదురీదుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ వర్సెస్ బండి సంజయ్ హోరా హోరీ కొనసాగుతోంది. రౌండ్ రౌండ్‌కీ ఫలితం మారిపోతూ నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఇక బీజేపీ నేతలు రాజాసింగ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ వంటి వారు సైతం ఎదురీతున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుది సైతం అదే పరిస్థితి. ఇక చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఇంకా ఒక్క రౌండ్ కూడా ఫలితాలు రాకపోవడం గమనార్హం.

Whammo.. KCR Izzat Paye..:

T Elections: KCR fell to the third position.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement