Advertisement
Google Ads BL

నందమూరి హీరోకి ఇలాంటి పరిస్థితా


నందమూరి తారకరామారావు గారు నటుడిగా ఇప్పటికి ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో పదిలంగా గుడికట్టుకున్న నటులు. ఆయన వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా. బాలయ్య ఇప్పటికి హీరోగా తన మార్క్ చూపిస్తున్నారు. ఇక ఆయన తర్వాత కళ్యాణ్ రామ్, తారక్ లు ఇండస్ట్రీలోకి వచ్చారు. కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో హీరోగా సెటిల్ అయ్యాడు. కానీ ఎన్టీఆర్ ఎలాంటి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగిపోయి ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి మరో కుర్రాడు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆయనే చైతన్య కృష్ణ. చైతన్య కృష్ణ బ్రీత్ అనే సినిమాలో హీరోగా కనిపించాడు. బ్రీత్ సినిమా రిలీజ్ డేట్, ప్రమోషన్స్ అన్ని కాస్త వింతగానే కనిపించాయి. ఫ్యామిలీ సపోర్ట్ తో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాడు, ఆతర్వాత యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని ఫ్యామిలీ ముచ్చట్లు చెబుతూ సినిమాని ప్రమోట్ చేసుకున్నాడు.

డిసెంబర్ 2న బ్రీత్ విడుదల అని చెప్పడమే కానీ.. అసలు ఆ సినిమా విడుదలయ్యిందో లేదో కూడా తెలియదు. మీడియాకి షో లేదు, దానితో బ్రీత్ కి రివ్యూ కూడా సోషల్ మీడియాలో కానరావడమే లేదు. బ్రీత్ సినిమాని ప్రమోట్ చెయ్యడమే ఎక్కువ అన్నట్టుగా మేకర్స్ కనిపిస్తే.. ఈ సినిమాతో మనకెందుకు అని  మీడియా కూడా లైట్ తీసుకున్నట్టుగా కనిపించింది. మరి సినిమా ఇండస్ట్రీలో అంత పెద్ద సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కి ఇలాంటి పరిస్థితా అంటూ నెటిజెన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.

Nandamuri hero has a similar situation:

Nandamuri Chaitanya Krishna Breathe releasing dec 2nd
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs