Advertisement
Google Ads BL

BB7 : ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే..


అనుకున్నదే అయ్యింది.. బిగ్ బాస్ సీజన్ 7 లో ఉల్టా పుల్టా అంటూ ఏదో ఆసక్తి పెంచే ప్రయత్నంలో.. ఎప్పుడేం చేస్తున్నారో అనేది బుల్లితెర ప్రేక్షకులకే అర్ధం కాకుండా చేస్తున్నారు. కొన్నాళ్లుగా సీరియల్ బ్యాచ్ ని కాపాడేందుకు బిగ్ బాస్ యాజమాన్యం, స్టార్ మా యాజమాన్యం ట్రై చేస్తుంది అనేలా మరోసారి బిగ్ బాస్ డెసిషన్ కనిపించింది. ఈ వారంలో శోభా శెట్టి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. అంటే పోల్స్ అన్నీ శోభా శెట్టే డేంజర్ జోన్ అని చూపించాయి. ఆ సర్వేల్లో ఈ వారం ప్రియాంక లేదా శోభా అవుట్ అన్నారు.

Advertisement
CJ Advs

కానీ ప్రియాంకని శోభా శెట్టిని టాప్ 5 వరకు తీసుకెళ్లే భాగంలో ఈవారం అర్జున్ ని కానీ గౌతమ్ ని కానీ బిగ్ బాస్ యాజమాన్యం బలి చెయ్యాలని డిసైడ్ అయినట్లుగా ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. అర్జున్ అయితే టికెట్ టు ఫినాలే టాస్క్ గెలవడంతో ఇప్పుడు ఎలిమినేషన్ ప్లాన్స్ మారిపోయాయి. ఈ వారం నామినేషన్స్ లో దగ్గర్లో ఉన్న అర్జున్ అనుకోకుండా ఫినాలేకి వెళ్లిపోవడంతో ఇప్పుడు శోభా ప్లేస్ లో గౌతమ్ బలయ్యాడు. అంటే ఈ వారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడన్నమాట.

మొదటి వారంనుంచి ఆట కన్నా నోటికి పని చెప్పి శివాజీ ని టార్గెట్ చేస్తూ సీక్రెట్ రూమ్ కి వెళ్లి గౌతమ్ 2.ఓ అంటూ రంగులు చూపించిన గౌతమ్ కృష్ణ ప్రతి వారం శివాజీని టార్గెట్ చేస్తూ హైలెట్ అయ్యాడు. నామినేషన్స్ లో అందరితో ముఖ్యంగా శివాజితో గొడవపడే గౌతమ్ తనకి ప్రియాంక చెల్లెలు అంటూ చెప్పేవాడు. డాక్టర్ గౌతమ్ కృష్ణ ఇప్పుడు యాక్టర్ గా మారి చివరిలో అంటే 13 వ వారంలో శోభా శెట్టి వలన ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడాడు. 

BB7 : Who is eliminated this week?:

Gautham Krishna was eliminated in the 13th week of Bigg Boss Telugu 7
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs