సీఎం రేసులో రేవంత్‌కు గట్టి పోటీనిస్తున్న ఆ నేత ఎవరో తెలుసా?
తెలంగాణ దంగల్ ముగిసింది. మరికొన్ని గంటల్లో ఫలితమూ రానుంది. ఇక ఆ తరువాత సీన్ గెలిచిన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయడం. ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుందని తెలిపాయి. అంతా బాగానే ఉంది కానీ కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ సీఎం ఎవరవుతారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డౌటేముంది టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డియే అవుతారని అంటారా? కాదండి బాబు.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. డజను మంది సీనియర్లు సీఎం కుర్చీపై కన్నేశారట. ఇది ముందుగా అనుకున్నదే అయినా కూడా వారంతా పోటీకి రాకపోవచ్చేమో అనుకున్నాం కానీ ఫలితం వెలువడిన వెంటనే ఢిల్లీకి ఫ్లైట్‌కు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారట.
కుర్చీలాట తప్పదు..
ముఖ్యంగా సీఎం సీటు కోసం రేవంత్‌కు సీఎల్పీలీడర్ భట్టి విక్రమార్క గట్టి పోటీ ఇస్తున్నారట. కాంగ్రెస్ పార్టీలో ఇది సర్వసాధారణమే. రాష్ట్రం మారొచ్చేమో కానీ సీన్ మాత్రం ఇదే ఉంటుంది. కర్ణాటకలోనూ ఇదే సీన్ నడిచింది కానీ అక్కడ ఒకరికి సీఎం, మరొకరికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి కూల్ చేశారు. ఇక్కడ ఇద్దరి కంటే ఎక్కువ మంది పోటీ పడే అవకాశం ఉంది. వారందరినీ ఎలా కూల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ గెలిస్తే మాత్రం కుర్చీలాట తప్పదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి సహా ఎన్నికల్లో పోటీ చేయని జానారెడ్డి సైతం రేసులో ఉన్నారు. అయితే మెయిన్ పోటీ మాత్రం రేవంత్, భట్టిల మధ్యనేనని తెలుస్తోంది. జనాలు మాత్రం రేవంతే సీఎం అనుకుంటున్నారు.
కాంగ్రెస్ విజయం సాధించిందంటే ఆ క్రెడిట్ రేవంత్‌దే..
నిజానికి రేవంత్ రెడ్డి.. టీడీపీ నుంచి.. కాంగ్రెస్ లోకి చేరిన తర్వాతే ఆ పార్టీకి జవసత్వాలు వచ్చాయి. జనాల్లో ఒక ఊపు తీసుకొచ్చారు. సీనియర్లంతా ముప్పేట దాడి చేస్తున్నా కూడా ఏమాత్రం తగ్గలేదు. యూత్ కాంగ్రెస్ ను ముందుండి నడిపించారు. నిరుద్యోగుల్లో ఆశను రగిలించారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించిందంటే దానికి రేవంతే కారణమనడంలో సందేహం లేదు. అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం దగ్గర నుంచి సోషల్ మీడియాను రేవంత్ చక్కగా నడిపించారు. అలాంటి రేవంత్ అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలోనూ మంచి అభిప్రాయమే ఉందని టాక్. మరోవైపు భట్టి కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. ఆయనకు పలువురు కాంగ్రెస్ సీనియర్ల మద్దతు కూడా ఉంది కానీ సీఎం అయ్యే అవకాశం మాత్రం రేవంత్‌కే ఉందని తెలుస్తోంది.