మెగా ఫ్యామిలోకి ఉపాసన హీరో రామ్ చరణ్ ని వివాహం చేసుకుని పెద్ద కోడలిగా చిరంజీవి ఇంట అడుగుపెట్టింది. ఈ మధ్యనే చరణ్ దంపతులు తల్లితండ్రులయ్యారు. పదేళ్లుగా మెగా ఫ్యామిలిలో అన్ని బాధ్యతలను కోడలిగా ఉపాసన చక్కబెడుతూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇక రీసెంట్ గానే హీరోయిన్ లావణ్య త్రిపాఠి అదే మెగా ఫ్యామిలోకి చిన్న కోడలిగా నాగబాబు ఇంట అడుగుపెట్టింది. వరుణ్ తేజ్ ని ప్రేమించి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకుంది.
వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠీల వివాహం ఇటలీ వేదికగా అంగరంగ వైభవంగా జరగగా.. హైదరాబాద్ లో నాగబాబు గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించారు. ఇక పెళ్లికి ముందు, పెళ్లి అనుకున్నాక,పెళ్లి తర్వాత కూడా లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది పెళ్లి అయిన కొద్దిరోజులకే మరదలు నిహారిక నిర్మాతగా మొదలైన మూవీ ఓపెనింగ్ లో భర్తతో కలిసి సందడి చేసింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ తో కలసి నాగ చైతన్య దూత వెబ్ సీరీస్ ప్రీమియర్ కి అటెండ్ అయ్యింది.
తాజాగా లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో బ్రైడల్ లుక్ షేర్ చేసింది. రెడ్ కలర్ శారీలో లావణ్య చాలా అందంగా కనిపించింది. రెడ్ కలర్ డిజైనర్ వెర్ సారీ లో మెడలో నెక్ లెస్ తో బ్యూటిఫుల్ గా కనిపించింది. ఆ శారీ లో మెగా చిన్న కోడలు చాలా బ్రైట్ గా మెరిసిపోయింది. లావణ్య త్రిపాఠి న్యూ లుక్ అదిరిపోయింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.