Advertisement
Google Ads BL

ఫాన్స్ కూడా డిస్పాయింట్ అవుతున్నారు


ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. డైనోసార్ దిగిపోయాడు. ప్రభాస్ ఫాన్స్ కి మేకర్స్ ఫుల్ మీల్స్ ఇచ్చేశామన్నారు. కానీ సలార్ ట్రైలర్ వచ్చింది. అది చూసిన కాసేపటికే నెటిజెన్స్ కామెంట్స్ పెట్టారు, సోషల్ మీడియా చూస్తే #Disappointed హ్యాష్ టాగ్ దర్శనమిచ్చింది. సలార్ ట్రైలర్ పై ఎన్ని అంచనాలైతే ఉన్నాయో.. అన్ని ట్రోల్స్ మొదలయ్యాయి. సలార్ ట్రైలర్ కి KGF కి పెద్దగా తేడా లేదు, సేమ్ లొకేషన్స్, సేమ్ లుక్స్ కంటిన్యూ చేసారు అంటూ పెదవి విరుపులు.

Advertisement
CJ Advs

సలార్ ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అనుకుంటే.. సోషల్ మీడియాలో కనిపిస్తున్న కామెంట్స్ తో ప్రభాస్ ఫాన్స్ కూడా డిస్పాయింట్ అవుతున్నారు. సలార్ ట్రైలర్ ఎలా ఉంది అంటూ చేసిన పోస్ట్ ల కింద కొంతమంది నచ్చింది అంటే.. కొంతమంది నచ్చలేదు, అసలు KGF కి సలార్ కి పోలిక లేదంటూనే మొత్తం యాజిటీజ్ గా చూపించారు, ఉగ్రం ట్రైలర్ చూసినట్టుగా ఉంది, ప్రభాస్ డైలాగ్ డెలివరీ బిగ్ మైనస్, Original #ugramm trailer >>> Remake #SalaarTrailer #disappointed ,#KGF2 Teaser >>> #SalaarTrailer, Disaster boaring trailer of #Salaar, అంటూ కామెంట్స్ రేజ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

ప్రభాస్ డైలాగ్ డెలివరీ ఏదోలా ఉంది, ఆ కటౌట్ కి ఆ వాయిస్ సరిపోలేదు అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. సలార్ ట్రైలర్ తో హైప్ ఎక్కువవుతుంది అనుకుంటే.. ఇప్పుడు సలార్ పై క్రేజ్ తగ్గేలా ఉంది అంటున్నారు. సలార్ ట్రైలర్ స్టార్ట్ అయ్యి సగం అయ్యేవరకు ప్రభాస్ రాలేదు, అసలు ప్రభాస్ హీరోనా లేదంటే పృథ్వీ రాజ్ సుకుమారన్  హీరోనా అంటూ అడుగుతున్నారు. మొత్తానికి సలార్ ట్రైలర్ అభిమానులని కూడా శాటిస్ ఫై చెయ్యలేకపోయింది.. అని ఈ కామెంట్స్ చూస్తే అర్ధమవుతుంది.

Fans are also disappointed:

Salaar trailer is a disappointment for Prabhas fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs