తెలంగాణలో పోలింగ్ ముగిసింది. ఫలితం ఈవీఎంలలో భద్రంగా ఉంది. మరికొన్ని గంటల్లో ఏ పార్టీది విజయం అనేది తేలిపోతుంది. అయితే ఎగ్జిట్ పోల్ ఫలితాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఫేవర్‌గా ఉండటంతో ఆ పార్టీలో ఫుల్ జోష్ నెలకొంది. ఈ సమయంలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఒకప్పుడు ఆంధ్రోళ్ల పెత్తనం మనకు అవసరమా? అంటూ ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ ప్రజానీకంలో రగిలించిన నేత కేసీఆర్. అప్పటికే ఆంధ్ర పెత్తనంపై రగిలిపోతున్న జనాలు, నేతలకు కేసీఆర్ కూడా తోడయ్యారు. అంతా కలిసి పోరాడారు. తెలంగాణ వచ్చేసింది. కేసీఆర్ తెలంగాణకు తొలి సీఎం అయ్యారు. అక్కడి వరకూ ఒక చాప్టర్ క్లోజ్.
చాటు మాటుగా రాజకీయం..
ఆ తరువాత ఎన్నికల్లో మా తెలంగాణలో మీ రాజకీయమేంటంటూ టీడీపీని విమర్శించి.. త్వరలోనే ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు సవాళ్లు విసిరారు కేసీఆర్. 2018 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ గెలుపు కోసం తెరచాటున తీవ్రంగా శ్రమించారు. జగన్‌ను గెలిపించారు. అప్పటి నుంచి జగన్‌తో చాటు మాటుగా రాజకీయం చేస్తూనే ఉన్నారు. ఏపీని అధోగతి పాలు చేయడంతో తన వంతు పాత్ర పోషించారు. చివరికి తెలంగాణలో పోలింగ్‌కు కొన్ని గంటల సమయం ఉంది అనుకున్నప్పుడు కూడా నాగార్జున సాగర్ డ్యాం దగ్గర పోలీసుల హడావుడి అంతా కేవలం జనాల్లో సెంటిమెంటును రాజేయడం కోసమే కేసీఆర్ చేయించారని టాక్. కానీ అది వర్కవుట్ కాలేదు.
ఏపీలో రాజకీయమంతా మారిపోనుందా?
నాన్న పులి కథ మాదిరిగా ప్రతీసారి సెంటిమెంట్ కథ చెబితే వర్కవుట్ కాదు. ఇక్కడ కూడా అది డాట్ బాల్‌గానే మిగిలిపోయింది. సాగర్ డ్యాం వద్ద జగన్ తన పోలీసు యంత్రాంగంతో చేయించిన హడావుడితో కేసీఆర్‌తో బంధం తాలుకు గుట్టును రట్టు చేసినట్టు అయిపోయింది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ రాబోతోందని సర్వేలు తేల్చాయి. ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ విన్ అయితే మాత్రం.. బాల్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేతుల్లోకి వస్తుంది. చంద్రబాబుకు కేసీఆర్ ఏ రిటర్న్ గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకున్నారో.. రేవంత్ ఇప్పుడు అదే రిటర్న్ గిఫ్ట్‌ను జగన్‌కు ఇస్తారని టాక్. మొత్తానికి త్వరలోనే ఏపీలో రాజకీయమంతా మారిపోనుందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడమనేది.. జగన్‌ను కలవరపాటుకు గురి చేస్తోందట.