Advertisement
Google Ads BL

BB7 : అర్జున్ ఒంటరి పోరాటం


బిగ్ బాస్ సీజన్ 7 లోకి వైల్డ్ కార్డు తో ఎంట్రీ ఇచ్చిన అర్జున్ అంబటి మాత్రమే ప్రస్తుతం హౌస్ లో ఉన్నాడు. ఐదుగురు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వగా అందులో మొదటి వారం నయని పావని, రెండో వారం పూజ, ఆ తర్వాత వారాల్లో వరసగా భోలే, ఆ తర్వాత అశ్విని ఎలిమినేట్ అయ్యారు. కానీ కండబలం బుద్ధిబలం ఉన్న అర్జున్ మాత్రం టాప్ 5 కి దగ్గరయ్యాడు. అతనకి బుద్ధిబలం, కండబలం ఉంది, టాస్క్ లన్నిటిలో సోలోగా అతనే గెలుస్తున్నాడు. కానీ అతనికి హౌస్ మేట్స్ నుంచి అస్సలు సపోర్ట్ లేదు.

Advertisement
CJ Advs

హౌస్ లో రెండు గ్రూప్ లు ఉన్నాయి. అందులో శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ ఒక గ్రూప్. మరొక గ్రూప్ స్టార్ మా సీరియల్ బ్యాచ్ ది. అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి ఒక గ్రూప్. వీరిలో వీరు సహాయం చేసుకోవడమే కానీ.. వీరు మరొకరికి సపోర్ట్ చెయ్యరు. తాజాగా టికెట్ ఫినాలే టాస్క్ లోనూ అంతే జరిగింది. శోభా శెట్టి శివాజీని ఒప్పించి వారి కాయిన్స్ అమర్ కి ఇచ్చేసింది. ఆతర్వాత ప్రియాంక గౌతమ్ కి ఇచ్చినా గౌతమ్ చివరికి అమర్ కే పాయింట్స్ ఇచ్చాడు. 

ఇక యావర్ పల్లవి ప్రశాంత్ కి ఇచ్చాడు. మరి వీళ్ళలో వీళ్ళు హెల్ప్ చేసుకున్నారు కానీ.. ఎవ్వరూ అర్జున్ కి సపోర్ట్ చెయ్యలేదు, హెల్ప్ కూడా చెప్పలేదు. అర్జున్ సింగిల్ హ్యాండ్ తోనే తన అదృష్టాన్ని నమ్ముకుని ఆట ఆడాడు. ఒంటరిగా పోరాటం చేసాడు. అసలే ఈ వారం గౌతమ్ కానీ, అర్జున్ కానీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. దానితో అర్జున్ కి టికెట్ టు ఫినాలే టాస్క్ లో గెలవాల్సి ఉంది. మరి అర్జున్ ఫైనల్ గా ఈ టాస్క్ గెలిచి టాప్ 5 లోకి ఎంటర్ అయ్యాడో, లేదో ఈరోజు నైట్ ఎపిసోడ్ లో తెలిసిపోతుంది. 

BB7 : Arjun lone struggle:

Bigg Boss 7: Yesterday episode highlights 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs