Advertisement
Google Ads BL

సైలెంట్ గా దిల్ రాజు ఇంట శుభకార్యం


దిల్ రాజు ఇంట ఆయన సోదరుడు శిరీష్ కొడుకు, రౌడీ బాయ్స్ హీరో ఆశిష్ రెడ్డి నిశ్చితార్ధం గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోయింది. ఈమధ్యనే సంబంధం కుదిరింది.. దిల్ రాజు ఇంట పెళ్లి వేడుకలు మొదలు కాబోతున్నాయనే న్యూస్ వినిపించిన తరుణంలోనే దిల్ రాజు తండ్రి గారు కాలం చేసారు. దాంతో తన తమ్ముడి కొడుకు ఆశిష్ నిశ్చితార్ధాన్ని కేవలం కుటుంబ సభ్యుల మధ్యలోనే సింపుల్ గా నిర్వహించినట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

ఆశిష్ ఆంధ్రకి చెందిన బిజినెస్ మ్యాన్ కుమర్తె అద్వైత రెడ్డి తో పెళ్లి పీటలెక్కేందుకు రెడీ అయ్యాడు. నిన్న గురువారం ఆశిష్-అద్వైత రెడ్డిల ఎంగేజ్మెంట్ కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల మధ్యన సింపుల్ గా ఎవరికీ తెలియకుండానే కానిచ్చేశారు. అయితే ఇంత పెద్ద శుభ కార్యాన్ని ఇంత సైలెంట్ గా చేయడం వెనుక కారణం.. దిల్ రాజు గారి తండ్రి కాలం చెయ్యడమే అని, ఆయన పోయి మూడు నెలలు కూడా గడవని కారణంగానే ఈ నిశ్సితార్ధాన్ని సైలెంట్ గా చేసారని అంటున్నారు.

ఇక నవంబర్ 30 న ఎంగేజ్మెంట్ జరగగా.. ఫిబ్రవరిలో ఆశిష్-అద్వైత రెడ్డిల వివాహం ఉంటుంది అని, ఈ పెళ్లి వేడుకని దిల్ రాజు ఫ్యామిలీ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారని సమాచారం, అటు రాజకీయ, ఇటు సినీ ప్రముఖుల నడుమ వివాహాన్ని జరిపించనున్నట్లుగా తెలుస్తుంది.

Dil Raju Nephew Ashish Gets Engaged:

Rowdy Boys hero Ashish gets engaged
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs