జబర్దస్త్ లో కిర్రాక్ ఆర్పీ గా పేరు తెచ్చుకుని ఫేమస్ అయ్యి ఆ తర్వాత నాగబాబు భజన చేసుకుంటూ జబర్డస్త్ ని వదిలేసి.. జబర్దస్త్ పై, ఆ యాజమాన్యంపై సంచలన కామెంట్స్ చేస్తూ ఆపై వేర్ వేరే ఛానల్స్ లో కామెడీ చేస్తూ కనిపించాడు. కాని జబర్దస్త్ అంత ఫేమ్ మాత్రం ఏ ఛానల్ లో కిర్రాక్ ఆర్పీకి రాలేదు. అయితే గత ఏడాది ఇదే సమయంలో కూకట్ పల్లిలో నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు అంటూ ఒక్కసారిగా యూట్యూబ్ ఛానల్స్ లో హైలెట్ అయ్యాడు. కిర్రాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్ ని రాష్ట్రం నలుమూలల వ్యాప్తి చేసాడు.
అయితే చేపల పులుసు కర్రీ పాయింట్ పెట్టకముందే ఆర్పీ తాను ప్రేమించిన అమ్మాయి లక్కీని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అప్పట్లో ఆర్పీ ఎంగేజ్మెంట్ కి రోజా, నాగబాబు, జబర్దస్త్ కమెడియన్స్ ఇలా చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ఆ తర్వాత ఈ చేపల పులుసు బ్రాంచెస్ ఓపెన్ చేసే వ్యవహారంలో పడి బిజీ అయిన ఆర్పీ ఈ ఏడాది నవంబర్ లో లక్ష్మి ఉరఫ్ లక్కీని వివాహం చేసుకుంటానని చెప్పాడు. ఎప్పుడెప్పుడు ఆర్పీ తన పెళ్ళి ముచ్చట చెబుతాడా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. తీరా చూస్తే ఆర్పీ తన పెళ్లిని గుట్టు చప్పుడు కాకుండా చేసుకుని షాకిచ్చాడు.
లక్కీ వాళ్ళ సొంతూరు వైజాగ్ లో తన ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేసి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. వీరి పెళ్లి నిన్న నవంబర్ 29 బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. అయితే ఎలాంటి హాడావిడి లేకుండా ఇలా గప్ చుప్ గా ఆర్పీ లక్కీని పెళ్లి చేసుకోవడం ఏంటని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఆర్పీ తన వివాహం తర్వాత మీడియాతో మట్లాడుతూ.. ఏడాదిన్నర క్రితమే లక్కీ నేను ఎంగేజ్మెంట్ చేసుకున్నామని.. ఆ ఎంగేజ్మెంట్ కు సినీ తారలు, ప్రముఖులు వచ్చారు.
అయితే పెళ్లిని స్పెషల్ గా వైజాగ్ లో చేసుకోవడానికి కారణం.. బంధువుల సమక్షంలో తమ పెళ్లిని చేసుకోవాలని అనుకున్నాం, అందుకే వైజాగ్ లోనే పెళ్లి చేసుకున్నాం. పక్కనే బీచ్ ఉంది.. అలలు వస్తూ ఉంటాయి, చల్లని గాలి.. వస్తుంది. అందరికీ బాగుంటుందని ఇక్కడే చేసుకున్నామని, అందుకే సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నామని ఆర్పీ చెప్పుకొచ్చాడు. ఆర్పీ - లక్కీల పెళ్లి ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.