యంగ్ హీరోయిన్ శ్రీలీల టాలీవుడ్ యంగ్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఒకరిద్దరి హీరోలు తప్ప మిగతా యంగ్ హీరోలంతా శ్రీలీలతో జోడి కట్టారు. మళ్ళీ మళ్ళీ జత కడుతున్నారు. ధమాకాలో శ్రీలీల అందానికి, ఆమె డాన్స్ లకి ముగ్దులైన ప్రేక్షకులతో పాటుగా హీరోలు కూడా శ్రీలీల నామ జపమే చేసారు. వరసగా ఆమెకి ఆఫర్స్ ఇచ్చేసారు. శ్రీలీల కూడా వచ్చిన అవకాశాన్ని వదలకుండా సైన్ చేసుకుంటూ పోయింది. దెబ్బకి నెలకో సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది.
అయితే శ్రీలీల కి ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి ఆమెకి దర్శకనిర్మాతలు అన్యాయం చేసినట్లే కనిపిస్తుంది. రామ్ తో నటించిన స్కంద లో నాలుగు పాటలు, రెండు మూడు సీన్స్ కే శ్రీలీల ని రిమితం చేసారు. నిన్నగాక మొన్న విడుదలైన ఆదికేశవలోను అదే మాదిరి నాలుగు సీన్స్, రెండుపాటలకే ఆమెని పరిమితం చేసారు. శ్రీలీల వేసిన డాన్స్ స్టెప్స్ తోనే సినిమాలు ప్రమోట్ చేసుకుంటూ రిలీజ్ చేసారు.
ఇక ఇప్పుడు రాబోయే నితిన్ ఎక్సట్రార్డినరీ మూవీలో కూడా శ్రీలీల కొన్ని సీన్స్ కే పరిమితమంటూ ప్రచారం స్టార్ట్ అయ్యింది. అంటే డాన్స్ లకి, గ్లామర్ కే శ్రీలీల ని పరిమితం చేస్తున్నారా.. ఆమెకి అంతకన్నా మంచి కేరెక్టర్స్ ఇవ్వడం లేదు, జస్ట్ డాన్స్ ల కోసమే శ్రీలీలని తీసుకుంటున్నారా, అసలు శ్రీలీల కూడా డాన్స్ లనే నమ్ముకుని ఎన్నిరోజులు గెటాన్ అవుతుంది అంటూ టిజెన్స్ కామెంట్స్ మొదలయ్యాయి. మరి శ్రీలీలకి గురూజీ అదే త్రివిక్రమ్ అయినా గుంటూరు కారంతో న్యాయం చేస్తారో, లేదో.. అని మాట్లాడుకుంటున్నారు.