Advertisement
Google Ads BL

చాన్నాళ్ళకి దర్శనమిచ్చిన బుట్టబొమ్మ


మహేష్ గుంటూరు కారం సినిమా నుంచి పూజ హెగ్డే తప్పుకున్నాక పూజ హెగ్డే హడవిడి సోషల్ మీడియాలో కూడా పెద్దగా కనిపించడం లేదు. ఏదో బాలీవుడ్ ఈవెంట్స్, పార్టీల్లో మాత్రమే కనిపిస్తున్న పూజ హెగ్డే ని ఇంకా కొన్నాళ్ళాగితే తెలుగు ప్రేక్షకులు పట్టించుకోరేమో అనేలా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ఇప్పుడు శ్రీలీల, రష్మిక ఇలా వీరి పేర్లే టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా పూజా హేగే ముచ్చట అంతగా కనిపించడం లేదు. 

Advertisement
CJ Advs

గుంటూరు కారం నుంచి ఆమె డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేక వెళ్ళిపోయింది అని నిర్మాత కవర్ చేసినా, ఆమె పిఆర్ టీమ్ చెప్పినా పూజ హెగ్డే ప్రస్తుతం ఎక్కడా బిజీగా లేదు, బాలీవుడ్ ప్రాజెక్ట్స్ సైన్ చేసినా అవి ఇంకా షూటింగ్స్ జరుపుకోవడం లేదు. అయితే పూజ హెగ్డే సోషల్ మీడియాలో కూడా కనిపించి చాలారోజులైంది. దివాళి పార్టీలో సందడి చేసిన ఆమె మళ్ళీ చాన్నాళ్ళకి దర్శనమిచ్చింది. ఆకుపచ్చ ట్రెండీ శారీ లో గ్లామర్ గా కనిపించింది.

స్లీవ్ లెస్ బ్లౌజ్ లో మోడ్రెన్ లుక్ తో అదరగొట్టేసింది. లూజ్ హెయిర్ తో మోడ్రెన్ గా కనిపించింది. అయితే ఈమధ్యన పూజా హెగ్డే టాలీవుడ్ మీడియం హీరోతో ఒక మూవీ చేయబోతుంది అనే ప్రచారం జరుగుతున్నా ఆ విషయమై అధికారికంగా ప్రకటన వచ్చేవరకు డౌటే.

Pooja Hegde Photos In Green Saree:

Pooja Hegde New Experimental Looks In Saree
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs