ఎన్నికలకు కౌంట్‌డౌన్ స్టార్ట్.. శ్రేణులకు కాంగ్రెస్ హై అలెర్ట్..
తెలంగాణలో ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరో 48 గంటలు కూడా సమయం కూడా లేదు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఆదేశాల మేరకు ఒకవైపు ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు బీఆర్ఎస్ పార్టీపై దృష్టి పెట్టింది. దీనికి కారణంగా బీఆర్ఎస్ పార్టీ పోల్ మేనేజ్‌మెంట్ చేసి ఓటర్లను తమ వైపు తిప్పుకోనుందనే ప్రచారం సాగుతుందటం. అలాగే బీఆర్ఎస్ లీడర్లకు పోలీసులు, అధికారులు సహకారం అందించే అవకాశం ఉందని సునీల్ కనుగోలు హెచ్చిరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఆగడాలను ఎలాగైనా అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసింది.
పైకి ధీమాగా ఉన్నా లోలోపల కంగారు..
ఇక ప్రధాన పార్టీలు రెండూ కూడా గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ఎవరి లెక్కల్లో వారున్నారు. కాంగ్రెస్ పార్టీ తమకు 70 నుంచి 80 సీట్లు వస్తాయంటుంటే.. బీఆర్ఎస్ సైతం ఇదే మాట చెబుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త మాత్రం ఎప్పటికప్పుడు మంత్లీ, వీక్లీ వైజ్ రిపోర్టును తయారు చేసి తెలంగాణ పీసీసీతో పాటు కాంగ్రెస్ అధిష్టాననానికి పంపిస్తోందట. అయితే బీఆర్ఎస్ మాత్రం పైకి ధీమాగా ఉన్నా కూడా లోలోపల చాలా కంగారుపడుతోందని వారి మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రభుత్వం ఫెయిల్యూర్స్‌ను, తెలంగాణ ఇచ్చిన విషయాన్ని జనంలోకి కాంగ్రెస్ పార్టీ పర్ఫెక్ట్‌గా తీసుకెళ్లగలిగింది. మొత్తానికి పార్టీ నేతలంతా ఈ సారి గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహించారు.
బీఆర్ఎస్‌కి ప్లస్ పాయింట్ వచ్చేసి..
ఈ క్రమంలోనే ఈ కొన్ని గంటలే ఏ పార్టీకైనా కీలకం. ఇప్పటికే అభ్యర్థులంతా ఎవరి పని వారు చూసుకుంటూనే బీఆర్ఎస్ నేతల కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించిందట. కాంగ్రెస్ శ్రేణులను తప్పుదోవ పట్టించే అవకాశం అయితే ఉందని.. అలెర్టుగా ఉండాలని దిశా నిర్దేశం చేసిందట. టఫ్ ఫైట్ ఉన్న 25 నుంచి 30 స్థానాలపై సునీల్ కనుగోలు టీమ్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్‌కి ప్లస్ పాయింట్ వచ్చేసి.. పోల్ మేనేజ్‌మెంట్. దీనిపై కాంగ్రెస్ ముఖ్యంగా నజర్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏ ఒటరూ సైతం మిస్ కాకుండా పోలింగ్ కేంద్రానికి రప్పించేలా హస్తం పార్టీ ప్లాన్ చేస్తోందట. మొత్తానికి మరికొన్ని గంటల్లో ఏ పార్టీ భవితవ్యం ఏంటనేది తేలిపోనుంది.