యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 ఒక్కసారి సెట్స్ మీదికి వెళ్ళింది అంటే అప్పుడు ఎన్టీఆర్ దేవరపై నార్త్ లో క్రేజ్ మొదలవుతుంది. అంటే ఇప్పుడు నార్త్ లో దేవరపై క్రేజ్ లేదు అని కాదు.. వార్ 2 స్టార్ట్ అయితే మాత్రం ఆ అంచనాలు వేరే లెవల్ కి వెళతాయి. ఎన్టీఆర్-కొరటాల శివ కలయికలో దేవర మూవీ ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతుంది. ఆర్.ఆర్.ఆర్ తో బాలీవుడ్ ని కూడా షేకాడించిన ఎన్టీఆర్ కి దేవర విషయంలో అంత కాన్ఫిడెన్స్ పనికిరాదు. ఎందుకంటే బాహుబలితో నార్త్ లో ప్రభాస్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలేవీ నార్త్ ఆడియన్స్ ని ఆకట్టుకోలేక నిరాశపరిచాయి.
ఇప్పుడు దేవర విషయంలో అసలే కొరటాల ప్లాప్ లో ఉన్నాడు. ఈ సమయంలో భారమంతా ఎన్టీఆర్ మీదే ఉంటుంది. ఎంతగా హీరోయిన్ ని, విలన్ ని బాలీవుడ్ నుంచి పట్టుకొచ్చినా.. దేవరపై అనుకున్న అంచనాలు క్రియేట్ అవ్వవు. అక్కడ జాన్వీ కపూర్ టాప్ హీరోయిన్ కాదు, సైఫ్ అలీ ఖాన్ క్రేజ్ ఉన్న నటుడు కూడా కాదు. అందుకే ఎన్టీఆర్-కొరటాల ఎంతగా దేవరపై నార్త్ లో క్రేజ్ పెంచినా అది ఎంతవరకు రీచ్ అవుతుందో చెప్పడం కష్టం. ఇప్పుడు ఎన్టీఆర్ హ్రితిక్ తో కలిసి చెయ్యబోయే వార్ 2 షూట్ లో అడుగుపెడితే అప్పుడు దేవరపై ఆటోమాటిక్ గా క్రేజ్ మొదలవుతుంది.
వార్ 2 షూటింగ్ కి హాజరై ఎన్టీఆర్ ముంబై ఎయిర్ పోర్ట్ లో తరచూ కనిపిస్తాడు, అప్పుడు నార్త్ ఆడియన్స్ లో ఎన్టీఆర్ పై ఒకరకమైన ఆలోచన మొదలవుతుంది. అది దేవర విడుదల సమయానికి క్రేజ్ గా మారుతుంది. అలా సినిమాపై అంచనాలు వస్తాయి. ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ ఎన్టీఆర్ ఫాన్స్ లో మొదలయ్యింది. మరి ఎన్టీఆర్ వార్ 2 సెట్స్ లోకి వెళ్లే తరుణం కోసం ఆయన ఫ్యాన్స్ చాలా వెయిటింగ్.