Advertisement
Google Ads BL

BB7 : శివాజీని టార్గెట్ చేసిన హౌస్ మేట్స్


బిగ్ బాస్ సీజన్ 7 లో చాణుక్యుడి శివాజి అసలు రంగు బయటపడింది. సీరియల్ బ్యాచ్ పై శివాజీ పెంచుకున్న అక్కసుని నాగార్జున శనివారం ఎపిసోడ్ లో బయటపెట్టారు. అమర్ దీప్ ని కెప్టెన్ కాకుండా శివాజీ అడ్డుకోవడం, అర్జున్ కి మాటివ్వకుండా మాటిచ్చానని చెప్పడం ఇవన్నీ బయట నెగిటివిటీని క్రియేట్ చేసాయి.. ఇప్పుడు హౌస్ మేట్స్ లో శివాజీ పై ఒకరకమైన అభిప్రాయం ఏర్పడింది. పల్లవి ప్రశాంత్, యావర్ అంటే శివాజీ శిష్యులు తప్ప మిగతా హౌస్ మేట్స్ మొత్తం శివాజీని ఈ వారం నామినేషన్స్ లో టార్గెట్ చేసారు.

Advertisement
CJ Advs

ప్రియాంక తనని అబద్దాలు కోరు అనడంపై శివాజీని నామినేట్ చేస్తూ.. నా విషయంలో ముందులో మంచిగానే ఉండేవారు, గేమ్ ఆడినప్పుడు ప్రోత్సహించేవారు, కానీ నాపై ఇంతగా ఇప్పుడు విషం ఎందుకు చిమ్ముతున్నారో అనగానే శివాజీ లేదమ్మా నువ్వు వినవు, నువ్వు అంతే అంటూ అరిచేసాడు. ఇక అర్జున్ కూడా నేను హౌస్ లో ఏది వినకూడదు అనుకున్నానో నాగార్జున గారి నోటి వెంట అదే విన్నాను, అన్నా మీరు నాకు మాటివ్వలేదు, నా భార్య మిమ్మల్ని అడగలేదు, మీరు నాకు ఓటేసేముందు నేను మీతో చెప్పకపోవడం నాదే పొరబాటు అనగానే శివాజీ.. నేను స్నేహితుడు అనుకున్నాను, కానీ నువ్వన్నట్టు తెలియని మిత్రుడు కంటే తెలిసిన శత్రువు బెటర్ అని, అలాంటప్పుడు ఈఫ్రెండ్ షిప్ బ్యాండ్ వద్దు అంటూ ఫైర్ అయ్యాడు.

తర్వాత గౌతమ్ కూడా శివాజీని టార్గెట్ చేస్తూ నేను డల్ గా ఉన్నప్పుడు ఎంకరేజ్ చేశాను అన్నారు, మీరు యావర్, పల్లవి ప్రశాంత్ కి తప్ప ఎవ్వరికి సహాయం చెయ్యరు. నాపై మీకు చాలా నెగిటివిటి ఉంది, వీకెర్ సెక్షన్ వెనుక నిలబెడతా అన్నారు అంటూ నామినేట్ చేసాడు. దానితో శివాజీ వాళ్ళిద్దరి విషయంలో నేను ఎక్కడన్నా వారికి సపోర్ట్ చేసానా.. ఛాలెంజ్ చేస్తున్నా నేనెప్పుడూ ఇన్వాల్వ్ అవ్వను అంటూ అరిచేసాడు. మరి ఈవారం శివాజీని హౌస్ మేట్స్ బాగానే టార్గెట్ చేశారనిపించేలా 13 వ వారం నామినేషన్స్ ప్రోమో కనిపిస్తుంది. 

BB7 : Housemates who target Sivaji:

Bigg Boss 7: Today promo out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs