Advertisement
Google Ads BL

ఎలిమినేషన్ తర్వాత అశ్విని ఫస్ట్ ఇంటర్వ్యూ


బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ 12 వ వారంలో డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన అశ్విని ముందుగా ఎలిమినేట్ అయ్యి హౌస్ ని వీడింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాక అశ్విని అబ్బాయిలతో టాస్క్ ల్లో పోటీ పడింది. కానీ ఆమె ఎవ్వరితో కలవలేకపోవడం, ఒకరి దగ్గర మరొకరి ముచ్చట్లు పెట్టడం, ముఖ్యంగా ప్రియాంక జైన్ ని అనవసరంగా టార్గెట్ చేస్తూ మట్లాడడం ఇవన్నీ అశ్వినిపై ఆడియన్స్ లో నెగెటివ్ థాట్స్ క్రియేట్ చేసాయి. భోలే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాక అశ్విని మరింత డల్ అయ్యింది.

Advertisement
CJ Advs

ఇక ఈవారం అశ్విని ఎలిమినేట్ అయ్యి బయటికొచ్చాక ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అశ్విని నాగార్జున పక్కన నుంచుని స్టేజ్ పై ఏదైతే చెప్పిందో ఆ ఛానల్ ఇంటర్వ్యూలోనూ అదే చెప్పింది. హౌస్ లో రెండు గ్రూప్స్ ఉన్నాయని అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక ఓ గ్రూప్ అని ఇంకా శివాజీ, యావర్, ప్రశాంత్ లు ఓ గ్రూప్ అని కాని తాను ఎందులో లేక ఏకాకిగా మిగిలిపోయి ఎలిమినేట్ అయ్యానని, అదే భోలే ఇలా హౌస్ లో ఎవరైనా ఉంటే ఆట వేరే లెవల్ ఉండేది, ఇంకా స్ట్రాంగ్ గా ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది.

ఇక మొదటి నుంచి ప్రియాంక తనని డామినేట్ చేస్తుంది, ఆమె కన్నింగ్ అంటూ ప్రియాంక గురించి చెప్పింది. పల్లవి ప్రశాంత్ తన దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ గురించి నేను ఎక్స్పెక్ట్ చెయ్యలేదు, ఆ పాస్ గెలవడానికి నేను కూడా చాలా ట్రై చేశాను. అతను 14 వారంలో వాడతాను అన్నాడు.. అంటే అప్పుడు ఆయన ఫ్రెండ్స్ శివాజీ అన్న కానీ, యావర్ కానీ ఉంటే వాడతాడేమో, నేను ఆ ప్లేస్ లో ఉంటే అలానే ఆలోచిస్తాను అంటూ అశ్విని ఎలిమినేషన్ తర్వాత తన ఫస్ట్ ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చింది. 

Ashwini first interview after elimination:

Bigg Boss 7: Ashwini first interview after elimination
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs