Advertisement
Google Ads BL

హౌస్ మేట్స్ అసలు రంగులు బయటపెట్టిన నాగ్


బిగ్ బాస్ సీజన్ 7 లో ప్రస్తుతం ఉన్న పదిమంది హౌస్ మేట్స్ లో కొంతమంది కలిసి ఆడుతున్నారు, గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, సీరియల్ బ్యాచ్ అంటూ నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. అటు స్టార్ మా యాజమాన్యం సీరియల్ బ్యాచ్ ని ఎలిమినేట్ కాకుండా కాపాడుతుంది అనే కామెంట్స్ ఎప్పటి నుంచో రేజ్ అవుతున్నాయి. ఇక శివాజీ శోభా శెట్టి, ప్రియాంక, అమర్ దీప్ పై ఉన్న కోపాన్ని, వారిపై ఉన్న వ్యతిరేఖతని లోలోపల పెట్టుకున్నా.. ఈరోజు శనివారం ఎపిసోడ్ లో వాటిని నాగార్జున కక్కించారు. వారు కెప్టెన్స్ అయ్యి రూల్ చేస్తున్నారు అది నాకు నచ్ఛలేదు.. అందుకే అమర్ దీప్ ని సపోర్ట్ చెయ్యలేదు అంటూ తన అసలు రూపం బయట పెట్టాడు శివాజీ. 

Advertisement
CJ Advs

ఇక పియంక అబద్దాలు ఆడుతుంది అంటూ శివాజీ చెప్పడంతో ప్రియాంక మొహం మాడిపోయింది. అమర్ దీప్ ఆటని నాగార్జున ఎత్తి చూపడమే కాదు వీడియోస్ వేసి వారి అసలు భాగోతాన్ని బయటపెట్టారు. అమర్ దీప్ నీ ఆట నిజామా.. లేదా యాక్టింగ్ గా అన్నారు. అంతేకాకుండా తన ఎమోషనల్ డ్రామాని బయటపెట్టారు. ఇక ప్రియాంక, శోభా శెట్టిల కంత్రి గేమ్ బయటికి తీశారు. మీరంతా ఎన్ని రోజుల కలసి ఆడతారు. ఆల్మోస్ట్ అయ్యిపోయింది.. ఇంకా ఎంత కాలమంటూ నాగార్జున ప్రియాంక-శోభా శెట్టిల అసలు రంగుని బయటికి తీశారు.

ఈ వారం సీరియల్ బ్యాచ్ ని నాగార్జున ఓ ఆట ఆడేసుకున్నారు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న కామెంట్స్ కి నాగార్జున ఈ  ఎపిసోడ్ లో పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పారు. కాకపోతే శివాజీ అపర చాణిక్యుడి తెలివిని మాత్రం హౌస్ మేట్స్ లో ప్రియాంక, అమర్ దీప్ లు అర్ధం చేసుకోలేక చచ్చిపోతున్నారు. మొత్తానికి ఈవారం హౌస్ మేట్స్ లోని కొంతమంది అసలు రంగులని నాగార్జున వీడియోస్ వేసి మరీ రివీల్ చేసి షాకిచ్చేసారు. 

Bigg Boss 7: Nagarjuna fires on Serial batch:

Bigg Boss 7: Nagarjuna Exposes Serial Batch game
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs