నిన్నటివరకు టాక్ అఫ్ ది టౌన్ అంటూ కలవరించిన టాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పుడు శ్రీలీల జెడ్జ్మెంట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టాలీవడ్ కి క్రేజీ హీరోయిన్ గా మారిపోయి టాప్ చైర్ ఎక్కేస్తుంది అనుకుంటే శ్రీలీలకి వరసగా ప్లాప్ లు ఎదురవుతున్నాయి. లక్కీ హీరోయిన్ కాస్తా ఇప్పుడు మరొక పేరుతో పిలిచేలా కనిపిస్తుంది. ధమాకా కేవలం శ్రీలీల ఎనేర్జి డాన్సులతోనే ఆడింది. ఆ తర్వాత భగవంత్ కేసరి తండ్రి కూతుళ్ళ అనుబంధంతో హిట్ అయ్యింది.
స్కంద కానీ, అదికేశవ రెండు సినిమాలు రొటీన్ గా ఉండడంతో శ్రీలీలకి ఆ రెండు బ్యాక్ టు బ్యాక్ బిగ్ షాకిచ్చాయి. శ్రీలీల డాన్సులతో థియేటర్లు ఊగిపోయినా.. ఆయా సినిమాల్లో కథా బలం లేకపోవడంతో ఈ రెండు అమ్మడుకి షాకిచ్చాయి. ఇక సినిమాల్లోనే కాదు ఆ సినిమాల ప్రమోషన్స్ లోను శ్రీలీల ఆకట్టుకునేలా అద్భుతంగా కనిపించింది. అయితే శ్రీలీల కెరీర్ ఎలా ఉన్నా తాజాగా శ్రీలీల పిక్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆ పిక్స్ లో శ్రీలీల క్యూట్ గా కాదు కిల్లింగ్ స్మైల్ తో యూత్ గుండెల్ని పిండేసేలా అనిపించింది. బ్లాక్ అండ్ వైట్ పిక్స్ లో శ్రీలీల నవ్వు చూస్తుంటే అబ్బో యూత్ ఆగడం కష్టమే. ప్రస్తుతం శ్రీలీల నితిన్ తో నటించిన ఎక్సట్రార్డినరీ మ్యాన్ విడుదలకి రెడీ అవడంతో ఆమె ఇకపై ఆ సినిమా ప్రమోషన్స్ కోసం రెడీ అవుతుంది.