రైతు బిడ్డ ట్యాగ్ తో బిగ్ బాస్ హౌస్ లో తనదైన ఆటతీరుతో బయట అభిమానులని సంపాదించుకుని టైటిల్ విన్నర్ కి చేరువలోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ అంటే హౌస్ లో చాలామందికి పడదు. ముఖ్యంగా అమర్ దీప్ లాంటి వాళ్ళకి. పల్లవి ప్రశాంత్ తో మొదటి నుంచి అంటే మొదటి వారం నుంచి నామినేషన్స్ లో గొడవపడుతున్న అమర్ ఇప్పుడు కెప్టెన్ కాకుండా శివాజీ అడ్డుకోవడంతో పల్లవి ప్రశాంత్ అభిమానులు సంబరపడిపోతున్నారు. కర్మ రిటన్స్ అంటూ వాళ్ళు సోషల్ మీడియాలో అమర్ దీప్ హాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ అమర్ దీప్ ని ఆడుకుంటున్నారు.
అమర్ దీప్ వీడియోని, శివాజీ వీడియో ని మార్ఫింగ్ చేస్తూ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. శివాజీ వెనుక అమర్ దీప్ అడుక్కుంటూ ఉన్నాడంటూ పోకిరిలో బ్రహ్మి కి శివాజీ ఫేస్ ని, అలీ కి అమర్ దీప్ ఫేస్ ని అతికించి ఆ వీడియో క్లిప్ ని వైరల్ చేస్తున్నారు. అమర్ దీప్ తో శివాజీ ఆడుకోవడం చూసి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక అమర్ దీప్ రైతు బిడ్డ ట్యాగ్, సింపతీ, సెంటిమెంట్ వాడొద్దు అంటూ మొదటి రెండు వారాల్లో ప్రశాంత్ ని టార్గెట్ చేస్తూ నామినేట్ చేసిన వీడియో కూడా వైరల్ చేస్తున్నారు.
నేను తేజుకి ఏమి చెయ్యలేదు, అమ్మా నాన్న లు చెప్పుకుంటారు నేను కెప్టెన్ అని, చివరిగా కెప్టెన్ అవ్వాలని ఉంది అంటూ అమర్ సెంటిమెంట్ డైలాగ్స్ చెప్పిన వీడియోస్ ని వైరల్ చేస్తూ కర్మ రిటన్స్ అంటూ అమర్ దీప్ ని ఆడేసుకుంటున్నారు పల్లవి అభిమానులు.