సోషల్ మీడియాలో ట్రోలర్స్ తో యుద్ధం చేసే టాప్ డైరెక్టర్ హరీష్ శంకర్ అసలైతే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ లో తలమునకలై ఉండాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణా రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆ మూవీ షూటింగ్ కి బ్రేకులు పడ్డాయి. ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా అన్నప్పటి నుంచి హారిష్ శంకర్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. పవన్ తో తేరి రీమేక్ చేస్తున్నాడంటూ ఆయనపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కత్తి కట్టారు. కానీ వారితో హరీష్ తరచూ ఫైట్ చేస్తూనే ఉంటాడు.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే హరీష్ శంకర్ తాజాగా సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసాడు. అందులో భాగంగా ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ అభిమానుల అంచనాలు మించి ఉంటుంది అని చెప్పిన హరీష్ శంకర్ తనకి దర్శకుడు శంకర్ అన్నా ఆయన డైరెక్షన్ అన్నా చాలా ఇష్టమని ఈ తరం దర్శకుల్లో సుకుమార్, సందీప్ రెడ్డి వంగా అంటే ఇష్టమని చెప్పాడు. త్రివిక్రమ్ గురించి చెప్పమని అడిగిన నెటిజెన్ కి ఆయన గురించి ఒక్క మాటలో చెప్పడం కష్టమని చెప్పాడు.
ఇక మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ కాంబో లో మూవీ చేస్తారా అని అడిగితే.. చిరు, చరణ్ అందులో పవన్ కళ్యాణ్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అంటూ ఇంట్రెస్టింగ్ గా ఆన్సర్ ఇచ్చాడు. అంటే హరీష్ ఎప్పటికైనా చిరు-పవన్-చరణ్ కలయికలో సినిమా చేస్తానని ఇలా తన కోరికని బయటపెట్టాడన్నమాట.