మాస్ మహారాజ్ రవితేజకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందా.. అంటే అయ్యిందనే అనిపిస్తుంది. లేదంటే బిగ్ బ్యానర్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ తో చెయ్యాల్సిన సినిమా నుంచి రవితేజని తప్పించారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వదు కదా. రవితేజ పారితోషకం విషయంలో బెట్టు చెయ్యడం వలనే రవితేజ ప్లేస్ లోకి మరో హీరోని తీసుకొచ్చేందుకు బిగ్ బ్యానర్ ప్లాన్ చేసినట్లుగా టాక్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో మొదలైన రవితేజ-గోపీచంద్ మలినేని కాంబో మూవీపై అనేక రూమర్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
అందులో నిజమెంతుందో కానీ.. బడ్జెట్ లెక్కలు వేసి మరీ హీరో రవితేజని ఈ ప్రాజెక్ట్ ఉంచి తప్పించారనే న్యూస్ మొదలయ్యింది. అయితే ఇప్పుడు రవితేజ ప్లేస్ లోకి బాలీవుడ్ హీరో కానీ, లేదంటే తమిళ హీరో కానీ రావొచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే ఏ భాషా హీరో అయినా వారు సీనియర్ హీరోలే ఉంటారని అంటున్నారు. మరి రవితేజ ప్లేస్ లోకి ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ కొత్త హీరో రాకపై రవితేజ ఫాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.