యానిమల్ టీమ్ సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్, రష్మిక వీరంతా టాలీవుడ్ టాప్ టాక్ షో ఆహా NBK అన్ స్టాపబుల్ కి హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా వారు నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో ఇప్పటికి రెండు సీజన్స్ ముగియగా మూడో సీజన్ ని వీలునిబట్టి ఎపిసోడ్స్ ని షూట్ చేస్తున్నారు. గత నెల భగవంత్ కేసరి టీమ్ తో ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ రాగా.. ఇప్పుడు యానిమల్ టీమ్ ఈ షోలో అడుగుపెట్టింది. రణబీర్ కపూర్ హిందీలో మాట్లాడుతూ అదరగొట్టేస్తే.. సందీప్ వంగా కాస్త బిడియంగా కనిపించాడు.
ఇక రష్మిక బ్లాక్ శారీలొ గ్లామర్ గానే కాదు.. అందంగా కనిపించింది. ఈ షోలో రశ్మికని అటు రణబీర్, ఇటు బాలయ్య ఇద్దరూ టీజ్ చేసి మరీ ఏడిపించారు. అది కూడా రష్మిక రూమర్ బాయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ కి ఫోన్ చేయించి మరీ రశ్మికని ఆటపట్టించారు. రశ్మికని విజయ్ దేవరకొండ కి కాల్ చెయ్యమని చెప్పగా రష్మిక విజయ్ దేవరకొండకి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసింది.
విజయ్ దేవరకొండ తో రష్మిక మ్లాడుతుండగా. యానిమల్ పోస్టర్, అర్జున్ రెడ్డి పోస్టర్స్ పక్క పక్కనబెట్టి ఏది ఇష్టమో చెప్పమంటే నేను హైదరాబాద్ కి వచ్చినప్పుడు మొదటిసారిగా అర్జున్ రెడ్డి చూసాను. సో నాకు అర్జున్ రెడ్డే ఫస్ట్ ఛాయస్, తర్వాత యానిమల్ ఇష్టం అన్నది. దానికి బాలయ్య ఫోన్ స్పీకర్ లోనే ఉంచు అంటూ రష్మిక-విజయ్ దేవరకొండ మట్లాడుతుండగా.. సందీప్ రెడ్డి వంగా, రణబీర్ లు అర్జున్ రెడ్డి సక్సెస్ పార్టీలో విజయ్ దేవరకొండ టెర్రస్ పై రశ్మికని చూసాము అనగానే రష్మిక ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ మాట్లాడాలా అంది కాస్త బిడియంగా.
దానికి రణబీర్ చూడండి సర్ విజయ్ తో మాట్లాడుతుంటే రష్మిక బుగ్గలు ఎలా ఎరుపెక్కాయో అంటూ టీజ్ చేసాడు. ఇక విజయ్ దేవరకొండ కూడా తనకి రణబీర్ అంటే చాలా ఇష్టమని, యానిమల్ చూసేందుకు వెయిట్ చేస్తున్నట్లుగా చెప్పగా.. రష్మిక విజయ్ తో మాట్లాడిన తీరుతో మరోసారి ఈ జంట సీక్రెట్ ప్రేమ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.