టైటిల్ ఫెవరెట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన సీరియల్ ఆర్టిస్ట్ అమర్ దీప్ మొదటి ఆరేడు వారాల్లో చాలా డల్ గా, టాస్క్ పెరఫార్మెన్స్ లేకుండా, జస్ట్ నామినేషన్స్ లో హైలెట్ అవుతూ కనిపించాడు. దానితో అమర్ దీప్ గ్రాఫ్ మొత్తం పడిపోయింది. ఆతరవాత అర్జున్ వచ్చాక అతని ఆటని ఎత్తి చూపించడంతో అమర్ లో కొద్దిగా మార్పు వచ్చింది. శోభా శెట్టిని కెప్టెన్ చెయ్యడం కోసం అమర్ దీప్ ఫైట్ చేసాడు. టాస్క్ లో గెలిచాడు. గత రెండు మూడు వారాలుగా అమర్ దీప్ గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది.
అటు ఓటింగ్ లోను అమర్ శివాజీ, పల్లవి ప్రశాంత్ లని వెనక్కి నెట్టి మొదటిస్థానంలో కనిపిస్తున్నాడు. కానీ ఇప్పుడు అమర్ దీప్ తన గ్రాఫ్ తానే తగ్గించుకుంటున్నాడు అనే అభిప్రాయాలూ నెటిజెన్స్ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే గత వారం కెప్టెన్సీ టాస్క్ విషయంలో అమర్ దీప్ ఏడుస్తూ హౌస్ మేట్స్ ని వేడుకున్నాడు. ప్రియాంక తో పోటీపడి గెలవలేక ఏడ్చేసిన ప్రోమోతో నెటిజెన్స్ కి అమర్ దీప్ విషయంలో మరోసారి నెగిటివ్ అభిప్రాయాలు మొదలయ్యాయి.
ఇక ఈవారం కెప్టెన్సీ టాస్క్ లోను అమర్ దీప్ ఓవరేక్షన్ చూసి చాలామంది ఏంటిది అమర్ ఇప్పుడిప్పుడే నీపై పోజిటివిటి వస్తుంది. కానీ ఇలా ఎందుకు చేస్తున్నావ్ అనిఅంటున్నారు, ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో శివాజీని అమర్ అడుక్కుంటున్న తీరుపై చాలామంది చాలారకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఏడుస్తూ శివాజీని బ్రతిమాలుకుంటుంటే శివాజీ రెచ్చగొడుతూ గత వారం అందుకే నీకు మాటిచ్చాననే సైలెంట్ గా ఉన్నాను, కానీ ఈ వారం అలా కాదు అన్నట్టుగా మాట్లాడాడు. దానితో అమర్ హైట్, వెయిట్ ఉంటే సరిపోతుందా నేను అలా లేను అంటూ ఏడ్చేస్తున్న ప్రోమో చూసి అమర్ ని చాలామంది చీప్ గా మాట్లాడుకుంటున్నారు.
అటు అర్జున్ అరే కెప్టెన్ కాకపోతే కప్ కొట్టలేవా అని సముదాయించాడు. ఈ వారం నాకు కెప్టెన్సీ కావాలి రా, అది ముఖ్యమంటూ అమర్ దీప్ వేడుకున్నాడు. అయితే ఈవారం ఫైనల్ గా అమర్ తన కల సాకారం చేసుకుని కెప్టెన్ అయ్యాడంటూ బిగ్ బాస్ లీకులు చెబుతున్నాయి.