Advertisement
Google Ads BL

మహేష్ ఫాన్స్ ని మళ్ళీ కదిలించింది


పుష్ప సినిమాని మహేష్ చేజార్చుకున్నందుకు మహేష్ ఫాన్స్ అప్పట్లో చాలా డిస్పాయింట్ అయ్యారు. మహేష్ బాబు-సుకుమార్ కాంబోలో రావాల్సిన పుష్ప కొన్నికారణాల వలన అల్లు అర్జున్-సుకుమార్ కలయికలో వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది. అప్పుడు మహేష్ ఫాన్స్ చాలా బాధపడ్డారు. అంతటి ప్యాన్ ఇండియా హిట్ ని మహేష్ వదులుకోవడంపై ఫీలయ్యారు. ఇప్పుడు మహేష్ ఫాన్స్ ని మరోసారి మరో సినిమా కదిలించింది. మహేష్ అది కూడా మిస్ చేసుకున్న సినిమానే.

Advertisement
CJ Advs

అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి వంగాతో మహేష్ సినిమా చేస్తాడనే ప్రచారం జరిగింది. సందీప్ రెడ్డి వంగాతో మహేష్ మీటింగ్స్ కూడా పెట్టాడు. కానీ మహేష్ ఎందుకో ఆ తర్వాత ఆ విషయం లైట్ తీసుకున్నాడు. సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో కబీర్ సింగ్ సక్సెస్ తో అక్కడి స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ మొదలు పెట్టాడు. తాజాగా యానిమల్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఆ ట్రైలర్ లో రణబీర్ లుక్స్, సందీప్ రెడ్డి డైరెక్షన్ చూసి మహేష్ ఫాన్స్ మరోసారి దిగులుపడిపోయి యానిమల్ గా మహేష్ ని ఊహించుకుని.. ఇప్పుడు అందులో రణబీర్ ని చూసి డిస్పాయింట్ అవుతున్నారు. 

యానిమల్ లాంటి సినిమా మహేష్ కి తగిలితే మహేష్ ప్యాన్ ఇండియా స్టార్ గా నెంబర్ 1 ప్లేస్ లోకి వెళ్ళిపోతాడు. యానిమల్ ట్రైలర్ చూసాక ప్రతి ఒక్క హీరో సందీప్ రెడ్డి వంగాతో ఒక్క సినిమా అయినా చెయ్యాలనే కోరిక మొదలై ఉండొచ్చు. కాని మహేష్ కి ఆ ఛాన్స్ వచ్చినా మహేష్ వదులుకోవడం మహేష్ ఫాన్స్ ని ఇప్పుడు బాధపెడుతోంది.

Mahesh fans are feeling emotional after seeing Animal trailer:

Mahesh Fans Not Able To Digest Animal Talk!
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs