మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి కమ్ బ్యాక్ అయ్యాక వరసగా సినిమాలు చేస్తున్నారు. సినిమా సినిమాకి ఒక్కోసారి చిన్న గ్యాప్ మాత్రమే తీసుకుంటుంటే ఒక్కోసారి అస్సలు విరామం లేకుండా పని చేస్తున్నారు. గత ఏడాది చిరు ఒకేసారి మూడు సినిమాల షూటింగ్ చేసారు. ఇక భోళా శంకర్ డిసాస్టర్ తర్వాత మెగాస్టార్ మూడు నెలలుగా బ్రేక్ తీసుకుని విశ్రాంతి మోడ్ లో ఉన్నారు. మధ్యలో ఆయన మోకాలికి సర్జరీ చేయించుకుని పూర్తి రెస్ట్ లోనే ఉన్నారు. ఇక ఇప్పుడు మెగాస్టార్ స్పీడు మళ్ళీ మొదలయ్యింది.
బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో మెగా ఫాంటసీ అడ్వెంచర్ #Mega156 దసరాకి గ్రాండ్ గా లాంచ్ అవ్వడంతో పాటు రికార్డింగ్ సెషన్స్ కూడా ప్రారంభమైయ్యాయి. తాజాగా #Mega156 రెగ్యులర్ షూట్ పై మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. విశ్వంభర అనే పవర్ ఫుల్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ మారెడుమిల్లి అడవుల్లో మొదలయ్యింది. మేకర్స్ చెప్పినట్టుగానే ఈ షెడ్యూల్ లో మెగాస్టార్ జాయిన్ అయినట్లుగా తెలుస్తుంది. అంటే ఇకపై మెగా స్పీడు మొదలిపోయినట్లే.
క్లాప్‌బోర్డ్ బ్యాక్ గ్రౌండ్ లో దట్టమైన అడవి కనిపించినట్లుగానే ఈ చిత్రం ఎక్కువ శాతం ఫారెస్ట్ లోనే జరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రాన్ని వసిష్ఠ పక్కా ప్లానింగ్ తో సెట్స్ మీదకి తీసుకెళ్లాడు. ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన ముగ్గురు హీరోయిన్స్ కి చోటు ఉంటుంది, ఆ హీరోయిన్స్ ని త్వరలోనే ఫైనల్ చేస్తారని తెలుస్తుంది. అందులో అనుష్క, నయన్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.