Advertisement
Google Ads BL

గుంటూరు కారంపై అంత కాన్ఫిడెన్సా?


గుంటూరు కారం 2024 సంక్రాంతికి రిలీజ్ అంటూ ఆరు నెలల క్రితమే ప్రకటించిన నిర్మాత నాగ వంశి.. ఆ చిత్రం విడుదలపై ఎన్ని ఊహాగానాలు నడిచినా.. వాటిని కొట్టిపారేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచుతూ ఎట్టిపరిస్థితుల్లో గుంటూరు కారం సంక్రాంతి కే విడుదల అంటూ ఘంటాపథంగా చెప్పుకుంటూ వస్తున్నారు. నిర్మాత నాగవంశీ తనకు సంబందించి ఏ సినిమా ప్రమోషన్స్ లో కనిపించినా.. ఆ సినిమా విషయాలను వదిలేసి మీడియా గుంటూరు కారం అప్ డేట్ కావాలంటూ ఒత్తిడి చేస్తుంది. ఫస్ట్ సింగిల్ ఊరించి ఊరించి వదిలినా.. అది మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకోవడంలో తడబడింది.

Advertisement
CJ Advs

ఇక తాజాగా గుంటూరు కారంకి రివ్యూస్ తో పనిలేదు అంటూ నిర్మాత నాగవంశీ చెప్పడం చూసిన వారంతా సినిమాపై అంత కాన్ఫిడెన్స్ ఉందా.. ఇప్పటివరకు మహేష్ సినిమాల్లో ఏ సినిమాకి రాని కాంట్రావర్సీలు ఈ సినిమాకి వచ్చాయి. టెక్నీషియన్స్ మార్పు, హీరోయిన్ మారడం, మధ్యలో మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో రకరకాల గుసగుసలు ఇలా ఈ చిత్రంపై అనేకరకాల న్యూస్ లు వినిపించాయి. అయితే ఇప్పుడు నాగవంశీ గుంటూరు కారం కి రివ్యూస్ తో పని లేదు, అది ఎప్పుడో బ్లాక్ బస్టర్ అంటూ చెప్పడం చూసి మరీ ఇంత కాన్ఫిడెన్సా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మరికొందరైతే అవునవును మహేష్ సినిమాలకి రివ్యూస్ తో పని లేదు, అదే విషయం మహేష్ గత మూడు సినిమాలు నిరూపించాయంటూ మహేష్ అభిమానులే సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం నాగవంశీ నమ్మకాన్ని గుంటూరు కారం ఎంతవరకు నిలబెడుతుందో అనేది.

Guntur Kaaram Is Review-Proof And A Sure Shot Blockbuster :

Guntur Kaaram Is Review-Proof And A Sure Shot Blockbuster: Naga Vamsi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs