Advertisement
Google Ads BL

అందుకే పుష్ప 2 షూట్ కి బ్రేక్


అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో బ్లాక్ బస్టర్ పుష్ప కి పార్ట్ 2 గా తెరకెక్కుతున్న పుష్ప ద రూల్ షూటింగ్ కూల్ గానే జరుగుతుంది. పుష్ప1 వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. ఇక పుష్ప 2 ని వచ్చే ఇది ఆగష్టు 15 న విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. పుష్ప 1 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి భారీ కలెక్షన్స్ సాధించడంతో.. మేకర్స్ పుష్ప 2 విషయంలో తగ్గేదేలే అంటున్నారు. అటు సుకుమార్, అల్లు అర్జున్ లు కూడా పుష్ప 2 విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Advertisement
CJ Advs

మధ్యలో నేషనల్ అవార్డు రావడంతో అల్లు అర్జున్ ఈ చిత్రంపై మరింత ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే గత వారం రోజులుగా పుష్ప 2 షూట్ కి బ్రేకులు పడ్డాయి. కారణం అల్లు అర్జున్ బ్యాక్ పెయిన్ తో ఇబ్బంది పడడంతో సుకుమార్ కొద్దీ రోజులుగా పుష్ప 2 షూటింగ్ ని పక్కనబెట్టారు. ఈ నెల 27 నుండి #Pushpa2 కొత్త షెడ్యుల్ మొదలుకాబోతుంది. హైదరాబాద్ లోనే పుష్ప 2 షూటింగ్ ని ఈనెల 27 నుంచి మొదలు పెట్టనున్నారు.

రష్మిక కూడా వచ్చే షెడ్యూల్ లో జాయిన్ అవ్వబోతుంది. అల్లు అర్జున్-మలయాళ హీరో.. పుష్ప విలన్ ఫహద్ ఫాసిల్ పై యాక్షన్ సీక్వెన్స్ ఆల్మోస్ట్ చుట్టేసిన సుకుమార్.. పుష్ప 2 షూటింగ్ ని కూడా వచ్చే ఏడాది మార్చ్ కల్లా ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నారు.

Thats why Pushpa 2 shoot broke:

Pushpa 2 shooting update
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs