Advertisement
Google Ads BL

రేపే భగవంత్ కేసరి ఓటిటీ ఆగమనం


దసరా ఫెస్టివల్ సందర్భంగా అక్టోబర్ 19 న భారీ అంచనాలు నడుమ థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ-అనిల్ రావిపూడిల భగవంత్ కేసరికి ప్రేక్షకులు, క్రిటిక్స్ ఇద్దరూ జస్ట్ యావరేజ్ రెస్పాన్స్ చూపించారు. భగవంత్ కేసరికి విజయ్ లియో ఓపెనింగ్స్ వైజ్ గా దెబ్బేసింది. విజయ్ లియో కి ప్లాప్ టాక్ రావడంతో భగవంత్ కేసరికి కలిసొచ్చింది. రెండో రోజు నుంచే భగవంత్ కేసరి హవా కనిపించింది. దసరా పండగకి ఫ్యామిలీ ఆడియన్స్ భగవంత్ కేసరికి కనెక్ట్ అవడంతో సినిమా సూపర్ హిట్ అయ్యింది.

Advertisement
CJ Advs

ఇక ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అసలైతే విడుదలైన నాలుగు వారాలకే హిట్ సినిమాలు కూడా ఓటిటిలోకి వచ్చేస్తున్న రోజుల్లో భగవంత్ కేసరి ఐదు వారాల గ్యాప్ లో ఓటిటిలోకి రాబోతుంది. అంటే రేపు నవంబర్ 24 శుక్రవారం నుంచి భగవంత్ కేసరి ఓటిటీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. భగవంత్ కేసరి ఓటిటీ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ నుంచి ఈ అర్ధ రాత్రి స్ట్రీమింగ్ లోకి రానుంది.

అంటే నవంబర్ 23 అర్ధరాత్రి12 గంటల నుంచి భగవంత్ కేసరి ఓటిటీ ఆడియన్స్ ని ఆకట్టుకోవడానికి రెడీ అయ్యింది. మరి థియేటర్స్ లో మిస్ అయిన వారు ఓటిటిలో వీక్షించేందుకు రెడీ అయిపోండి. 

Bhagavanth Kesari on Amazon Prime from Tomorrow:

Bhagavanth Kesari on Amazon Prime from Nov 24)
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs