మాస్ మహారాజ్ రవితేజ వరస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు. ధమాకా తర్వాత రవితేజని పలకరించిన హిట్ లేదు. వాల్తేర్ వీరయ్య హిట్ అయినా.. ఆ చిత్రం సక్సెస్ మెగాస్టార్ ఖాతాలోకి వెళ్ళింది. ఆ తర్వాత వచ్చిన రావణాసుర డిసాస్టర్ అయ్యింది. ఆ తర్వాత రవితేజ ఎంతో నమ్మకంగా చేసిన ప్యాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరావు కూడా రవితేజకి బిగ్ షాకిచ్చింది. టైగర్ తో హిట్ కొట్టాలని రవితేజ చాలా అనుకున్నాడు. కానీ ఆ చిత్రం ఆడియన్స్ కి నచ్చలేదు.
అయినప్పటికీ రవితేజ తగ్గడం లేదు, బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి రవితేజ ఈగల్ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. అటు రవితేజకి వరస ప్లాప్ లు రావడంతో రవితేజ క్రేజ్ కొద్దికొద్దిగా తగ్గుతూ వస్తున్నప్పటికీ రవితేజ మాత్రం పారితోషకం విషయంలో మెట్టు దిగకుండా బెట్టు చేస్తున్నాడని ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వినిపిస్తున్న మాటే. అందుకే ఇప్పుడు రవితేజకి ఓ బిగ్ బ్యానర్ షాకిచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు.
టాలీవుడ్ బడా బ్యానర్ మైత్రి మూవీస్ లో రవితేజ గోపీచంద్ తో మూవీని గ్రాండ్ గా మొదలు పెట్టాడు. ఈ చిత్రం రేపో మాపో పట్టాలెక్కే సమయంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే న్యూస్ మొదలయ్యింది. గోపీచంద్-రవితేజ ప్రాజెక్ట్ కి సంబందించిన బడ్జెట్ లెక్కలు వేసుకుంటే తలకి మించిన బడ్జెట్ అవుతుంది అని, అందులో హీరో గారి పారితోషకం చూసిన మైత్రి వారు ఈ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టినట్లుగా తెలుస్తుంది.
మరి గోపీచంద్ తో నెక్స్ట్ మూవీ ప్లాన్ చేసిన నిర్మాతలు.. దానికి సంబంధించి హీరోగా రవితేజని తప్పించి మరో హీరోతో ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని చూస్తున్నారనే న్యూస్ రవితేజ ఫాన్స్ కి షాకిస్తుంది.