ఏపీలో ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. టీడీపీ, జనసేనలు పొత్తుతో బరిలోకి దిగుతుండగా.. వైసీపీకి మాత్రం ఎవరూ సహకరించే పరిస్థితి లేదు. దీంతో సింహం సింగిల్ అంటూ సినిమా డైలాగ్స్‌ను వల్లెవేస్తోంది. దీనికి జనసేనాని పవన్ కల్యాన్ కౌంటర్ కూడా ఇచ్చారు. మేము మనుషులం కాబట్టి గ్రూప్‌గానే వస్తాం అన్నారు. సరే.. ఇవన్నీ పక్కనబెడితే..
ప్రస్తుతం ఏపీలో టీడీపీ ఫుల్ జోష్‌తో ఉంది. వైసీపీ మాత్రం నిరాశలో కొట్టుమిట్టాడుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో టీడీపీలో ఆనందం వెల్లువెత్తుతోంది. ఇక ఆయన ఈ నెల 29 నుంచి జనాల్లోకి వెళ్లనున్నారు. అప్పుడు ఆయనకు బ్రహ్మరథం పట్టేందుకు జనమంతా ఎదురు చూస్తున్నారు.
అది కూడా అట్టర్ ప్లాఫ్..
ఈ క్రమంలోనే టీడీపీ జాతీయ ప్రధాన నారా లోకేష్ సైతం యువగళం యాత్రను తిరిగి చేపట్టేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మొత్తానికి టీడీపీలో ఉన్న కాస్తో కూస్తో ఆవేదనాభరిత వాతావరణం పోయి బీభత్సమైన జోష్ అయితే నెలకొంది. ఇక వైసీపీ నేతలు ఏదో చేద్దామనుకున్నారు. కానీ అంతా కొలాప్స్. టీడీపీ అధినేతను ఎన్నికలు అయ్యేంత వరకూ జైల్లోనే ఉంచాలనుకున్నారు. అది కుదరలేదు. రెగ్యులర్ బెయిల్ రాకుండా చూసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అది కూడా అట్టర్ ప్లాఫ్. ఇక చేసేదేమీ లేక సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఇక అక్కడ ఏమవుతుందో చూడాలి. మరోవైపు నారా లోకేష్‌ను సైతం కేసుల్లో ఇరికించి జనం మధ్యకు రాకుండా చూడాలని స్కెచ్ గీశారు.
కేడర్‌ను నిర్లక్ష్యం చేసిన వైసీపీ..
ఇక టీడీపీకి చెందిన కీలక నేతలందరిపై కేసులు బనాయించాలనుకున్నారు. తద్వారా వారిని జనంలో తిరక్కుండా చేయాలనేదే వైసీపీ బాస్ అంతిమ లక్ష్యం. కానీ ఏ కోరికా నెరవేరలేదు. ఏం చేయాలో ఆ పార్టీకి పాలు పోవడం లేదు. పైకి ఏవేవో ప్రకటనలు చేస్తున్నా కూడా లోలోపల మాత్రం పార్టీ నేతలంతా భయాందోళనల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు జనసేనతో పొత్తు లేకుండా చూద్దామనుకున్నారు. తద్వారా ఓట్లు చీలి లాభం చేకూరుతుందనుకున్నారు. అదీ నెరవేరలేదు. ఏం చేద్దామన్నా అవడం లేదు. పైకి చంద్రబాబుకి సింపతీ రాలేదు అని చెబుతున్నా కూడా అంతర్గతంగా మాత్రం ఇంత భారీగా సింపతీ వర్కవుట్ అవుతుందని భావించలేదంటూ చర్చించుకుంటున్నారట. పైగా వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులను నమ్ముకుని క్షేత్రస్థాయిలో కేడర్‌ను నిర్లక్ష్యం చేసింది వైసీపీ. దీంతో క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారట. మొత్తానికి ఒకే సమయంలో ఒక పార్టీలో జోష్.. మరో పార్టీలో నిరాశ కొనసాగుతోంది.