బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పూల్టాలో భాగంగా ఎవిక్షన్ ప్రీ పాస్ అనేది రెండోసారి జరిగింది. గత వారం ప్రిన్స్ యావర్ హౌస్ మేట్స్ తో పోటీపడి మరీ ఎవిక్షన్ ప్రీ పాస్ గెలువచుకున్నాడు. అయితే యావర్ హౌస్ మేట్స్ ని మోసం చేసి ఆడడంతో నాగార్జున వీడియో వేసి ప్రిన్స్ ఆటని ఎక్స్పోజ్ చేసారు. దానితో గిల్టీ ఫీలయిన యావర్ ఆ ఎవిక్షన్ ప్రీ పాస్ తిరిగి వెనక్కి ఇచ్చేసాడు. అలాగే బిగ్ బాస్ కూడా ఈ వారం ఎలిమినేషన్ ని తప్పించేసాడు. ఈవారం నామినేషన్స్ రచ్చ హౌస్ ని అతలాకుతలం చేసింది. ఒక్కొక్కరి రంగులు బయటికి వచ్చాయి.
నామినేషన్స్ లో రతికకి అమర్ కి మధ్యన, పల్లవికి-రతికకి మధ్యన, ప్రియాంక-శివాజీ, గౌతమ్ - శివాజీకి మధ్యన పెద్ద గొడవే జరిగింది. నామినేషన్ ముగిసాక మరోసారి ఎవిక్షన్ పాస్ కోసం హౌస్ మేట్స్ పోటీపడ్డారు. అందులో భాగంగా ఒంటి చేత్తో కిందపడకుండా బౌల్స్ నిలబెట్టాల్సి రావడంతో.. ఒక్కొక్కరు ఆ టాస్క్ లో అవుట్ అయ్యారు. ముందుగా రతిక, తర్వాత శివాజి, తర్వాత ఒక్కొక్కరిగా అవుట్ అయ్యారు. చివరికి ప్రియాంక, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ రేస్ లో నిలవగా ఎక్కువ సమయం బౌల్స్ కిందపడకుండా పట్టుకుని పల్లవి ప్రశాంత్ ఈ వారం ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు.
ఈవారం పల్లవి కూడా నామినేషన్స్ లో ఉన్నాడు. మరోపక్క గత రెండు వారాలుగా లక్కీగా సేవ్ అవుతున్న రతిక ఈవారం డేంజర్ జోన్ లో ఉంది. మరి పల్లవి ప్రశాంత్ సేవ్ అయ్యాక ఆ పాస్ ని రతిక కోసం వాడుతాడా.. లేదంటే అనేది చూడాలి. ఎందుకంటే రతిక గత రెండు వారాలుగా పల్లవి ప్రశాంత్ తో గొడవపడుతుంది. అందుకే పల్లవి ఆమె కోసం ఈ ఎవిక్షన్ పాస్ వాడకపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు. చూద్దాం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఏ ఇద్దరు హౌస్ ని వీడుతారో అనేది.