Advertisement
Google Ads BL

బాబు అరెస్ట్‌తో టీడీపీకి అంత మంచి జరిగిందా?


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టి ఏదో సాధించాలని స్కెచ్ గీసుకుని తాను లండన్ వెళ్లిపోయాక అమలయ్యేలా స్కెచ్ గీసుకున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల వరకూ చంద్రబాబును లోపలేయాలనేది ప్లాన్. ఆపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా కీలక నేతలందరినీ ఏవో ఒక కేసుల్లో ఇరికించేసి జైల్లో వేసి ప్రజల దరిదాపుల్లోకి కూడా ఎన్నికలయ్యే వరకూ రాకుండా చూడాలని వైసీపీ ప్రభుత్వం భావించింది. అనుకున్నట్టుగానే జగన్ లండన్ వెళ్లగానే ప్లాన్‌ను అమలు చేసింది. దీనిలో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించింది. ఆపై అనేక కేసులు ఆయనపై మోపి ఊపిరి సలపకుండా చేయాలని భావించింది.

Advertisement
CJ Advs

కష్టకాలంలో శత్రువులెవరు? మిత్రులెవరు?

ఇక నారా లోకేష్ చుట్టూ కూడా ఉచ్చు బిగించేందుకు యత్నించింది. తానొకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్టుగా మొత్తం చకచకా పరిణామాలన్నీ టీడీపీకి ఫేవర్‌గా మారిపోయాయి. టీడీపీ, జనసేనలను పొత్తు పెట్టుకోనీయకుండా చూడాలని వైసీపీ శతవిధాలుగా యత్నించింది. కానీ చంద్రబాబు అరెస్ట్‌తో పొత్తు కుదిరింది. అంతేకాదు.. అదే సమయంలో తనకు కష్టకాలంలో శత్రువులెవరు? మిత్రులెవరు? అనేది కూడా టీడీపీకి స్పష్టంగా తెలుసొచ్చింది. కేసీఆర్, జగన్ ఎప్పటికీ ఒకటేనని తన పట్ల గులాబీ బాస్ వైఖరిలో మార్పేమీ లేదని తెలుసుకుని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నుంచి తప్పుకుంది. అప్పటికే చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఆందోళనలపై నోరు జారిన బీఆర్ఎస్ వైఖరికి వ్యతిరేకంగా టీడీపీ కేడర్‌తో పాటు సెటిలర్స్ అంతా ఆ పార్టీకి రివర్స్ అయ్యారు.

జనంలోకి చంద్రబాబు..

అంతేకాదు.. రాజకీయాలకు పనికిరాడన్న నారా లోకేష్ సత్తా ఏంటో రాష్ట్రానికి తెలియడంతో పాుట టీడీపీ బలాలు, బలాహీనతలు తేటతెల్లమయ్యాయి. చంద్రబాబుపై అవినీతి ముద్ర వేయాలని వైసీపీ అధిష్టానం భావిస్తే.. రివర్స్‌లో బీభత్సంగా సింపథీ వర్కవుట్ అయ్యి.. ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరిగింది. రానున్న ఎన్నికల్లో ఇది టీడీపీకి ప్లస్ అయిపోనుంది. ఇక చంద్రబాబు 29 నుంచి ప్రజల మధ్యకి వెళ్లనున్నారు. మూడు నెలల తర్వాత ఆయన ప్రజల్లోకి వెళ్లనున్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఆయన్ను జనం రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. వైసీపీ కక్ష సాధింపులనేవి ఎలా ఉంటాయో టీడీపీకి బాగా తెలిసొచ్చింది. దీంతో టీడీపీ నేతలంతా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. మొత్తానికి జగన్ ఏదో అనుకుంటే దానికి పూర్తిగా రివర్స్‌లో జరిగింది.

Has Babu arrest done so well for TDP?:

Chandrababu into the crowd..
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs