Advertisement
Google Ads BL

హీరోయిన్ కోసం టికెట్ తెగే రోజులొచ్చాయ్


గతంలో పేక్షకులు హీరోయిన్స్ కోసమే పనిగట్టుకుని సినిమాలకి వెళ్లేవారు. హీరోయిన్స్ ని గ్లామర్ గా చూడడానికి, వారి డాన్స్ కోసము వెళ్లేవారు. గతంలో ఏమిటి అనుష్క, నయనతార లాంటి హీరోయిన్స్ సినిమాలొస్తే ఆడియన్స్ థియేటర్స్ కి క్యూ కట్టేవారు. కొన్నాళ్లుగా సినిమాల్లో హీరోయిన్స్ కి ప్రాధాన్యత ఉండడం లేదు. ఒక పాటకి, ఒక్క సీన్ కే పరిమితమైపోతున్నారు. టాప్ హీరోయిన్స్ కూడా డాన్స్ లకి, గ్లామర్ షోకి మాత్రమే పనికొచ్చేలా దర్శకులు హీరోలని హైలెట్ చేస్తున్నారు. దానితో హీరోయిన్స్ విషయాన్ని ఆడియన్స్ కూడా లైట్ తీసుకుంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా టాలీవుడ్ ని దున్నేస్తున్న శ్రీలీల ని చూసి మళ్ళీ టికెట్ తెగే రోజులొచ్చాయంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. శ్రీలీల అందానికి అందం, అభినయానికి అభినయం, గ్లామర్ కి గ్లామర్, డాన్స్ అయితే చెప్పక్కర్లేదు. ధమాకా, భగవంత్ కేసరి, స్కంద.. ఇప్పుడు రాబోయే ఆదికేశవ. ఆదికేశవ ట్రైలర్ రిలీజ్ అయ్యాక రొటీన్ అన్నవాళ్ళే.. ఇప్పుడు శ్రీలీల కోసం సినిమాకెళ్లాలనిపిస్తుంది అని మాట్లాడుకుంటున్నారు.

#Sreeleela హాష్ టాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. #Sreeleela హాష్ టాగ్ ఓపెన్ చేసి చూస్తే Heroine kosam tickets thempe rojulu vachai, Glamour, Expressions, Dance... అంటూ చేస్తున్న కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఆది కేశవ సినిమాలో శ్రీలీల డాన్స్ ఇరగదీసేసింది. మరి రేపు 24 న విడుదల కాబోయే ఈ మూవీలో వైష్ణవ తేజ్ కోసం కాకుండా శ్రీలీల కోసం థియేటర్స్ కి వెళ్లే ప్రేక్షకులని మనం చూడబోతున్నాం. దేనిని బట్టి శ్రీలీల ఆదికేశవకి బాగా హెల్ప్ అవుతుంది అనడంలో సందేహం లేదు. 

Sreeleela Adikeshava Release On Nov 24th:

Can Sreeleela help Aadikeshava?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs