కనడ భామ రష్మిక మందన్న ఇప్పుడు ప్యాన్ ఇండియా హీరోయిన్ గా పలు భాషల సినిమాలతో పేక్షకులని మెస్మరైజ్ చేస్తుంది. పుష్ప సినిమాతో ప్యాన్ ఇండియా ఆడియన్స్ ని మెప్పించిన రష్మిక తెలుగులో టాప్ చైర్ కోసం ఎప్పుడూ పోటీపడుతూనే ఉంది. ప్రస్తుతం పూజ హెగ్డే రేస్ లో వెనుకపడడంతో రష్మిక క్రేజ్ పెరిగింది. శ్రీలీల తో కాంపిటీషన్ పెరిగినా రశ్మికది ప్యాన్ ఇండియా రేంజ్. బాలీవుడ్ లోను రష్మిక సక్సెస్ కోసం వెయిట్ చేస్తుంది. యానిమల్ లాంటి భారీ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.
యానిమల్ మూవీ ప్రమోషన్స్ తో రష్మిక బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు హైలెట్ అవుతుంది. రష్మిక తాజాగా బ్లాక్ శారీ లో కళ్ళు జిగేల్ మనిపించే అందాలతో మతిపోగెట్టేసింది. హెయిర్ లీవ్ చేసి మెడలో సింపుల్ నెక్ లెస్ తో బ్లాక్ శారీలో అందాలని ఎంతగా చూపించాలో అంతగా చూపిస్తూ కనిపించిన రష్మిక బ్యూటిఫుల్ పిక్ ని సోషల్ మీడియాలో అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.