Advertisement
Google Ads BL

తెలంగాణ ఎన్నికల్లో సెంటిమెంటుదేనా కీలక పాత్ర?


ఈ సారి జరిగే ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ఎంత? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ వచ్చింది మొదలు.. సెంటిమెంటు అస్త్రంగా మారిపోయింది. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకూ అదే అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఉంటుంది. అప్పట్లో అంటే వర్కవుట్ అయ్యింది. మరి ఈసారి సంగతేంటి? మొదట్లో బీఆర్ఎస్ కూడా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించలేదు. కానీ ఇప్పుడిప్పుడు కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయ్యాక మళ్లీ అదే పాట పాడుతోంది. కాంగ్రెస్ పార్టీ తామే తెలంగాణను ఇచ్చిన పార్టీ తమదేనని గట్టిగా చెబుతుంటే.. బీఆర్ఎస్ నేతలు మాత్రం తాము పోరాడి తెచ్చామని చెబుతున్నారు. 

Advertisement
CJ Advs

తెలంగాణను తీసుకెళ్ళి కాంగ్రెస్‌కి అప్పగిద్దామా?

మంత్రి హరీష్ రావు అయితే ఒక అడుగు ముందుకేసి మరీ.. బ్రిటిష్ వారు ఈ దేశానికి స్వాతంత్రం తామే ఇచ్చామని చెబితే ఎలా ఉంటుందో.. కాంగ్రెస్ వారు చెప్పేది కూడా అలాగే ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక కేసీఆర్ కానీ.. కేటీఆర్ కానీ తాము పాల్గొన్న సభలన్నింటిలో ఇదే పాట పాడుతున్నారు. తెలంగాణా వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అనే నినాదాన్ని మరోసారి సీఎం గుర్తు చేస్తున్నారు. ఈసారి అసలు ప్రాంతీయ వాదమే ఉండదనుకుంటున్న తరుణంలో మళ్లీ బీభత్సంగా పార్టీలు ఈ వాదాన్ని అందుకుంటున్నాయి. ఇక తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత ఎంతలా అభివృద్ధి చేశామనేది బీఆర్ఎస్ ప్రతి సభలోనూ చెబుతోంది. ఇంత పోరాడి తెచ్చుకుని ఆపై.. అంతలా అభివృద్ధి చేసుకున్న తెలంగాణను తీసుకెళ్ళి కాంగ్రెస్‌కి అప్పగిద్దామా? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

జనాల మైండ్ సెట్లో మార్పు...

మొత్తానికి మరోసారి తెలంగాణ సెంటిమెంటును చలిమంట మాదిరిగా మెల్లమెల్లగా రగిలించి దావాణలాన్ని చేసేసింది బీఆర్ఎస్. మరి కాంగ్రెస్ పార్టీ కూడా సెంటిమెంటునే అస్త్రంగా చేసుకుంది. గట్టిగానే తమ పార్టీయే తెలంగాణను ఇచ్చిందని చెబుతోంది. మరి జనాలు ఈసారి సెంటిమెంటుకు కనెక్ట్ అవుతారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. కానీ కనెక్ట్ అవుతారనే మేధావులు అంటున్నారు. తెలంగాణ సెంటిమెంటు జనం నరనరాల్లోనూ జీర్ణించుకుపోయింది. మరికొన్నేళ్లు ఆగితే ఏమో కానీ.. ఇప్పటికైతే ఆ సెంటిమెంటు బాగానే వర్కవుట్ అవుతుందనుకుంటున్నారు. అయితే జనాల మైండ్ సెట్లో మాత్రం మార్పొచ్చిందని అంటున్నారు. గత రెండు దఫాలుగా తెలంగాణ ఇచ్చిన పార్టీ అయిన కాంగ్రెస్‌కి ఓటేయలేదు. ఒకటికి రెండు సార్లు గులాబీ పార్టీకి అధికారం అప్పగించాం. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం అనే భావన అయితే జనాల్లో ఉందని టాక్. మొత్తానికి ఏ పార్టీ వచ్చినా కూడా అది సెంటిమెంటు బలమే అనడంలో సందేహం లేదు.

Is sentiment a key role in Telangana elections?:

Telangana Elections: Change in people mind set...
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs